AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అరుంధతి 2’ లో అందాల ఐటెం బాంబ్

హైదరాబాద్‌: ‘స్వీటీ’ అనుష్క లీడ్ రోల్‌లో దివంగత డైరక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధతి’ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హర్రర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో అనుష్క నట విశ్వరూపం చూపించింది. ‘పశుపతి’ పాత్రలో నటించిన సోనూ సూద్‌ కూడా ఒళ్లు గగుర్పొడిచే రేంజ్‌లో యాక్ట్ చేశాడు. కాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ‘అరుంధతి 2’ తెరకెక్కబోతోంది. శ్రీ శంఖు చ‌క్ర ఫిల్మ్స్‌ ప‌తాకంపై కోటి తూముల ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరోయిన్ […]

‘అరుంధతి 2’ లో అందాల ఐటెం బాంబ్
Ram Naramaneni
|

Updated on: Jun 21, 2019 | 5:15 PM

Share

హైదరాబాద్‌: ‘స్వీటీ’ అనుష్క లీడ్ రోల్‌లో దివంగత డైరక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధతి’ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హర్రర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో అనుష్క నట విశ్వరూపం చూపించింది. ‘పశుపతి’ పాత్రలో నటించిన సోనూ సూద్‌ కూడా ఒళ్లు గగుర్పొడిచే రేంజ్‌లో యాక్ట్ చేశాడు. కాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ‘అరుంధతి 2’ తెరకెక్కబోతోంది. శ్రీ శంఖు చ‌క్ర ఫిల్మ్స్‌ ప‌తాకంపై కోటి తూముల ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరోయిన్ పాయల్ రాజపుత్ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించబోతోంది. ఈ మూవీ కోసం ఆమె గుర్రపుస్వారీ, క‌త్తి సాముల‌కు సంబంధించిన శిక్షణ తీసుకుంటోంది.

భారీ బ‌డ్జెట్‌, ఇప్పటి టెక్నాలజీకి తగ్గ రేంజ్ గ్రాఫిక్స్‌తో ఈ మూవీ తీయబోతున్నట్లు నిర్మాత కోటి తూముల చెప్పారు. ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్‌తోపాటు బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తార‌లు న‌టిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ విజువలైజేష‌న్ గ్రాఫిక‌ల్ వ‌ర్క్స్ హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో జ‌రుగుతోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించ‌బోయే ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, డైరక్టర్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివ‌రాలు అధికారికంగా  వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు.