అమలాపాల్ బోల్డ్‌నెస్‌కు.. సెన్సార్ కత్తెర!

అమలాపాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు రత్నకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆడై’. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజయ్యింది. అందులో అమలాపాల్ నేకేడ్ షాట్స్ సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. ఇక టీజర్ చూసిన సినీ సెలబ్రిటీస్ కొందరైతే అమలాపాల్ సాహసాన్ని మెచ్చుకుని.. ఆమెపై ప్రశంసలు కురిపించారు. సినిమాకు కూడా ఈ టీజర్ పెద్ద హైప్ తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇకపోతే టీజర్‌లో చూపించింది తక్కువేనని.. సినిమాలో ఇలాంటి షాట్స్ చాలా ఉన్నాయని కోలీవుడ్ మీడియాలో […]

  • Ravi Kiran
  • Publish Date - 4:44 pm, Fri, 21 June 19
అమలాపాల్ బోల్డ్‌నెస్‌కు.. సెన్సార్ కత్తెర!

అమలాపాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు రత్నకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆడై’. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజయ్యింది. అందులో అమలాపాల్ నేకేడ్ షాట్స్ సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. ఇక టీజర్ చూసిన సినీ సెలబ్రిటీస్ కొందరైతే అమలాపాల్ సాహసాన్ని మెచ్చుకుని.. ఆమెపై ప్రశంసలు కురిపించారు. సినిమాకు కూడా ఈ టీజర్ పెద్ద హైప్ తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇకపోతే టీజర్‌లో చూపించింది తక్కువేనని.. సినిమాలో ఇలాంటి షాట్స్ చాలా ఉన్నాయని కోలీవుడ్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

ఇది ఇలా ఉండగా చిత్ర యూనిట్‌కు షాక్ ఇస్తూ సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాలో ఉన్న పలు నేకేడ్ షాట్స్ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అసభ్యంగా ఉన్నాయనే కారణంతో కొన్నింటిని తొలిగించడమో, లేక డీఫోకస్ చేయడమో, లేక వేరే వాటితో రీ-ప్లేస్ చేయాలని ఆదేశాలు ఇచ్చి… చివరికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారని తెలుస్తోంది. దీంతో టీజర్‌లో ఉన్నంత బోల్డ్‌నెస్ సినిమాలో ఉండకపోవచ్చని సమాచారం.