Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FilmCelebrities Got Padma Vibhushan: పద్మ విభూషణ్ ను బాలు కంటే ముందు అందుకున్న సినీ కళాకారులు ఎవరో తెలుసా..!

దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను వివిధ రంగాల్లో విశిష్ట సేవలను అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తాజాగా లెంజడరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించిన అనంతరం..

FilmCelebrities Got Padma Vibhushan: పద్మ విభూషణ్ ను బాలు కంటే ముందు అందుకున్న సినీ కళాకారులు ఎవరో తెలుసా..!
Follow us
Surya Kala

|

Updated on: Jan 26, 2021 | 12:24 PM

Film Celebrities Got Padma Vibhushan: దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను వివిధ రంగాల్లో విశిష్ట సేవలను అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ పురష్కారం జనవరి 2, 1954 నెలకొల్పబడింది. భారతరత్న తర్వాత అతి పెద్ద గౌరవముగా ఈ పురస్కారమును గుర్తిస్తారు. భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవ నందించిన భారత పౌరులకు ఈ పతకమునిచ్చి గౌరవిస్తారు. కళలు, వైద్య రంగం, సామాజిక సేవ, సాహిత్యం, విద్య, సైన్స్, ఇంజనీరింగ్ ఇలా పలు రంగాల్లో విశిష్ట సేవలను అందించినవారికి ఈ పద్మను ఇచ్చి గౌరవిస్తారు.. తాజాగా లెంజడరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించిన అనంతరం కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. అయితే ఇప్పటి వరకూ సినీ రంగం నుంచి కొద్ది మంది మాత్రమే ఈ అవార్డు ను అందుకున్నారు. ఎస్పీ బాలు కంటే ముందు ఈ రెండో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న సినీ రంగం వాళ్లు ఎవరెవరో చూద్దాం..!

లతా మంగేష్కర్

ముందుగా సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ అందుకున్నారు. 1999లో అప్పటి రాష్ట్రపతి కే.ఆర్.నారాయణ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ను పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించారు. భారతీయ సినీమా చరిత్రలో ఎప్పటికీ మరువలేని..మరపురాని పాటలతో కోట్ల మంది ప్రేక్షకుల మనసు దోచిన గాయని లతా మంగేష్కర్ .. ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కళ్యాణ్ జీ-అనంద్ జీ, తర్వాత బప్పీలహరి, రాంలక్ష్మణ్, నుంచి ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ చాలామంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడిన లతా మంగేష్కర్ వయసు రీత్యా గత కొంతకాలం నుంచి పాటలకు దూరంగా ఉంటున్నారు.

ఆశా భోంస్లే

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు చెల్లెలుగా ఆశా భోంస్లే చిత్ర పరిశ్రమలో గాయనిగా అడుగు పెట్టినా తనకంటూ ఓ ఫేమ్ ను సంపాదించుకున్నారు అవును ఆమె పాటలు విన్నవారికి, వింటున్నవారికి, ఆ గొంతు ఎవరిదో ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే, ఆ గొంతు ఎంతో వినూత్నమైనది, విస్పష్టమైనది. మాధుర్యంతోబాటు మంచి విరుపులతో సంగీత అభిమానులను విశేషంగా ఆకర్షించే ఆ గళం హిందీ నేపథ్య గాయని ఆశాభోస్లేది. గళమంత సున్నితం ఆమె మనసు కూడా. ఈ సుమధుర గాయని పాడిన ప్రతి పాట మనసులో ముద్రవేసేదే. పాటలు పాడడంలో గిన్నీస్‌ పుస్తకంలో చోటు సంపాదించుకున్న ఈ అద్భుత గాయాని ఆశా భోంస్లే 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. అంతేకాదు సంగీత కళాకారులుగా ఒకే ఫ్యామిలీకి చెందిన అక్కచెల్లెలు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే లు పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్న వారుగా చరిత్రలో నిలిచిపోతారు.

దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు

నాటక రంగం నుంచి చిన్న వయసులోనే సినిమాల్లో అడుగు పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు. తెలుగు ప్రేక్షకాభిమానుల ఆదరణ ను సొంతం చేసుకున్న మహోన్నత వ్యక్తి ఏఎన్నార్. తెలుగు చిత్రసీమలో నవలానాయకునిగా జేజేలు అందుకున్న తొలి నటుడు ఏ ఏఎన్నార్ .. తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఆయన సినిమాలు, వాటి రికార్డులు, ఆయన పోషించిన పాత్రలు వంటి వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటసామ్రాట్ తనకు జీవితాన్ని ఇచ్చిన కళామతల్లికి సేవ చేయడానికి సినీ పరిశ్రమ తెలుగు రాష్ట్రంలో రావడానికి ముఖ్య కారకుడు ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పి, తనకెంతో ఇచ్చిన సినీ కళామతల్లి రుణం తీర్చుకున్నారాయన. తుదిశ్వాస వరకూ నటిస్తూనే ఉండాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు అక్కినేని 2011లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు.

దిలీప్ కుమార్

అలనాటి బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ విషాద చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన సినీ రంగంలో చేసిన సేవలకు గాను దిలీప్ కుమార్ 93 వ ఏట పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. దిలీప్ కుమార్ ఆరు దశాబ్దాలకు పైగా హిందీ చిత్రసీమకు అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ అవార్డుతో గౌరవించింది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్ కుమార్‌కు ముంబయి శివారు బాంద్రాలోని ఆయన నివాసానికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మహా రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ విద్యాసాగర్ రావు లు వెళ్లి మరీ ఈ అవార్డు ను అందజేయడం విశేషం

అమితాబ్ బచ్చన్

ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన పాత్రలతో భారతదేశపు మొదటి “యాంగ్రీ యంగ్ మాన్”గా ప్రసిద్ధి చెందారు ఆయన జీవితం పడిలేచిన కెరటం.. జీవితంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఆయన చూపిన గుండె నిబ్బరం.. పడ్డ కష్టం ఎవరికైనా స్ఫూర్తినిచ్చేదే. . అందుకే ప్రభుత్వం ఆయన్ని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’తో సత్కరించింది. 2015లో అప్పటి దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్

రజనీకాంత్

రజనీకాంత్ ఓ సాధారణ ఉద్యోగి.. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు దేశంలోనే అత్యంత ప్రజాధారణ కలిగిన నటుడిగా పేరు తెచ్చుకున్నారు . తన విలక్షణ నటనతో దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ 160 సినిమాలకు పైగా నటించారు.. 2016లో అప్పటి దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మవిభూషణ్ పురస్కారం సూపర్ స్టార్ రజినీకాంత్ అందుకున్నారు.

కేజే జేసుదాసు

జేసుదాసు ఐదు సినీ కళా జీవితంలో సింగర్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా వంటి భారతీయ భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేల పాటలను పాడారు. అవును ఆయన గానం స్వరరాగ గంగా ప్రవాహాం. ఆయన పాడుతుంటే.. దేవతలు సైతం తన్మయత్వంల పొందుతారు. అంతలా తన గానంతో ఆ సేతు హిమాచలంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన గాయకుల్లో కేజే యేసుదాసు అగ్రగణ్యలు. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్‌గా తన కంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న జేసుదాసు 2017లో రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు.

ఇళయరాజా

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల రచయిత, గాయకుడు. తన 30 ఏళ్ల సినీ కెరీర్ లో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరుగా ఖ్యాతిగాంచారు. ఇళయరాజా గారి నేపథ్య సంగీతంకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన పాశ్చాత్య ఆర్కెస్ట్రా లలో భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో చేసిన ప్రయోగాలు కూడా ప్రజలకు అప్పుడప్పుడు ఆయన ఇచ్చే సంగీత కచేరీల ద్వారా సుపరిచితమే. మ్యూజిక్ మేస్ట్రో గా సుపరిచతమైన ఇళయరాజా ను 2018లో కేంద్రం మన దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్‌తో గౌరవించింది. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నుంచి ఈ పురస్కారం అందుకున్నారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇంజనీర్ కాబోయి గాయకుడిగా భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ పీజీ లిఖించుకున్నారు 1966లో . శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్నమూవీలో పడిన పాటతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. అలా ప్రారంభమైన బాలసుబ్రమణ్యం సినీ కెరీర్‌ ఆయన చివరి శ్వాస వరకు సంగీత అభిమానులను అలరించింది. బాలు ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని ప్రధాన భారతీయ భాషల్లోను పాటలు పాడారు. ఆయన గొంతు ఖండాంతరాలను తాకింది. శంకరాభరణంలో బాలు పాడిన పాటలకు అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఇక నటుడిగా కూడా బాలు చాలా చిత్రాల్లో నటించి మంచి నటుడిగాను గుర్తింపు పొందాడు. తన గాత్రంతో దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న లెంజడరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణించిన అనంతరం కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

కేంద్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కేంద్ర రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సన్మానించింది. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత తెలుగు సినీ రంగం నుంచి రెండో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న గాయకుడు, నటుడు, నిర్మాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కావడం విశేషం. ఎస్పీ బాలు తరుపున ఆయన కుటుంబ సభ్యులు పద్మ విభూషణ్ అవార్డు అందుకోనున్నారు.

Also Read: భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా డూడుల్ తో గూగుల్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు