Actor Rajtharun: వరుస సినిమాలను లైన్లో పెడుతున్న యంగ్ హీరో.. తిరిగి ఫాంలోకి వచ్చిన రాజ్ తరుణ్..

మొదటి సినిమా 'ఉయ్యాలా జంపాలా'తో హీరోగా మంచి గుర్తింపు పొందాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత 'సినిమా చూపిస్తా మామ', 'కుమారీ 21ఎఫ్', వంటి

Actor Rajtharun: వరుస సినిమాలను లైన్లో పెడుతున్న యంగ్ హీరో.. తిరిగి ఫాంలోకి వచ్చిన రాజ్ తరుణ్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2021 | 12:00 PM

మొదటి సినిమా ‘ఉయ్యాలా జంపాలా’తో హీరోగా మంచి గుర్తింపు పొందాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత ‘సినిమా చూపిస్తా మామ’, ‘కుమారీ 21ఎఫ్’, వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ఆ తర్వాత ‘సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు’ వంటి సినిమాలు తీసిన అవి ఆశించినంతగా విజయాలను సాధించలేకపోయాయి. డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో వచ్చిన ‘ఓరెయ్ బుజ్జిగా’ ఓటీటీ వేదిక ఆహాలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.

ఇక మళ్ళీ ఒరేయ్ బుజ్జిగా డైరెక్టర్ విజయ్ కుమార్‏ డైరెక్షన్లో మరో సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ చిత్రంతోపాటు.. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మోహన్ వీరంకి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్‏గా నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ యంగ్ హీరో తిరిగి ఈ సినిమాలతో హిట్స్ అందుకుంటాడో లేదో చూడాలి మరి.

Also Read:

Pawan Kalyan : వైరల్ అవుతున్న పవన్ న్యూ లుక్ .. నెక్స్ట్ సినిమాలో కనిపించేది ఇలానేనా..?