Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathnam OTT: ఓటీటీలోకి వచ్చేసిన విశాల్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్.. ‘రత్నం’ ఎక్కడ చూడొచ్చంటే?

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం రత్నం. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. హరి దర్శకత్వం వహించారు. తమిళ్ తో పాటు తెలుగులోనూ గట్టిగా ప్రమోషన్లు నిర్వహించారు. టీజర్స్, ట్రైలర్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 26న తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి రత్నం థియేటర్లలో విడుదలైంది.

Rathnam OTT: ఓటీటీలోకి వచ్చేసిన విశాల్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్.. 'రత్నం' ఎక్కడ చూడొచ్చంటే?
Rathnam Movie
Follow us
Basha Shek

|

Updated on: May 23, 2024 | 7:40 PM

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం రత్నం. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. హరి దర్శకత్వం వహించారు. తమిళ్ తో పాటు తెలుగులోనూ గట్టిగా ప్రమోషన్లు నిర్వహించారు. టీజర్స్, ట్రైలర్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 26న తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి రత్నం థియేటర్లలో విడుదలైంది. రోటీన్ స్టోరీ అనే టాక్ వచ్చినా తమిళ్ తో బాగానే కలెక్షన్లు వచ్చాయి. అయితే తెలుగులో మాత్రం విశాల్ సినిమాకు నిరాశే ఎదురైంది. అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, ఊహకందని ట్విస్టులు విశాల్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. అలాగే ప్రియా భవానీ శంకర్ నటన కూడా మెప్పించింది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన రత్నం సినిమా నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంత చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (మే23) అర్ధరాత్రి నుంచే విశాల్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రస్తుతం తమిళ్ తో పాటు తెలుగులోనూ రత్నం సినిమా అందుబాటులో ఉంది.

జీ స్టుడియోస్ బ్యానర్ పై కార్తికేయన్ సంతానం నిర్మించిన రత్నం సినిమాలో సముద్రఖని, విజయ్ కుమార్, మురళీ శర్మ, యోగిబాబు,  రామచంద్రరాజు, గౌతమ్ మేనన్, మోహన్ రామన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ రత్నం సినిమాకు స్వరాలందించాడు. ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా, టీఎస్ జై ఎడిటర్ గా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

ఇక రత్నం సినిమా కథ విషయానికి వస్తే.. ఎమ్మెల్యే ప‌న్నీర్‌స్వామికి (స‌ముద్ర‌ఖ‌ని) ర‌త్నం (విశాల్ ) న‌మ్మిన బంటుగా ఉంటాడు. ప‌న్నీర్‌స్వామి అండ‌తో అవినీతి ప‌రుల అంతు చూస్తుంటాడు. అలాంటి ర‌త్నం జీవితంలోకి అనుకోకుండా మ‌ల్లిక (ప్రియా భ‌వానీ శంక‌ర్‌) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. కాగా మల్లికను హతమార్చడానికి లింగం బ్రదర్స్ శత విధాలా ప్రయత్నిస్తుంటారు. అసలు మల్లిక గతం ఏమిటి? శత్రువల బారి నుంచి మల్లికను ఎలా కాపాడాడు? తన శత్రువులపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నదే రత్నం సినిమా. మరి థియేటరల్లో ఈ ఊర మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను మిస్ అయ్యారా? అయితే అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఈ మూవీపై ఓ లుక్కేయండి.

రత్నం సినిమాలో విశాల్, ప్రియా భవానీ శంకర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.