Laapataa Ladies: యానిమల్ రికార్డ్ బ్రేక్ చేసిన చిన్న సినిమా.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న లాపతా లేడీస్..
ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. గత నెల 26న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా. ఇక ఇప్పుడు అక్కడ కూడా సరికొత్త రికార్డ్ సృష్టించింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. కేవలం 30 రోజుల్లోనే 13.8 మిలియన్ వ్యూస్ సాధించి అరుదైన ఘనతను సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ కిరణ్ రావు తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.
కంటెంట్ బలంగా ఉంటే చాలు ప్రచారాలు అక్కర్లేదని మరోసారి నిరూపించింది ఓ చిన్న సినిమా. భారీ ఈవెంట్స్, పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లేకుండా సైలెంట్‌గా విడుదలై సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ యానిమల్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా లాపాత లేడీస్. ఈ మూవీని బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించింది. దర్శకురాలిగా ఆమెకు రెండో సినిమా ఇది. పెద్ద స్టార్ నటీనటులు లేకుండా అతి తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. మార్చి 1న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.4 కోట్లతో నిర్మించిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. గత నెల 26న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా. ఇక ఇప్పుడు అక్కడ కూడా సరికొత్త రికార్డ్ సృష్టించింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. కేవలం 30 రోజుల్లోనే 13.8 మిలియన్ వ్యూస్ సాధించి అరుదైన ఘనతను సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ కిరణ్ రావు తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.
అటు అడియన్స్ నుంచి లాపతా లేడీస్ సినిమాకు మంచి రివ్యూస్ వస్తున్నాయి. యానిమల్ సినిమా ఓటీటీలో విడుదలైన నాలుగు నెలలు దాటింది. ఇప్పటివరకు ఈ సినిమాకు 13.6 మిలియన్స్ స్ట్రీమింగ్ మినట్స్ ఉన్నాయి. కానీ అదే రికార్డును ఇప్పుడు లాపతా లేడీస్ చిత్రం నెల రోజుల్లోనే క్రాస్ చేసింది. దీంతో ఈ రెండు చిత్రాలను పోలుస్తూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. గతంలో కిరణ్ రావు, సందీప్ రెడ్డి వంగా మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. సందీప్ తెరకెక్కించిన యానిమల్ సినిమాపై కిరణ్ రావు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆమె మాటలకు సందీప్ గట్టిగానే కౌంటరిచ్చారు. దీంతో ఇప్పుడు యానిమల్ సినిమాకు లాపతా లేడీస్ సినిమాకు కంపైర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.
లాపతా లేడీస్ సినిమాలో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ, రవికిషన్, ఛాయా కదమ్ కీలకపాత్రలు పోషించారు. కిరణ్ రావుతో కలిసి ఆమె మాజీ భర్త నటుడు అమీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 సెప్టెంబర్ లోనే ప్రదర్శితమైంది. ఆ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.