Prasanna Vadanam Movie: ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ప్రసన్న వదనం ఎక్కడ చూడొచ్చంటే..

కంటెంట్ ప్రాధాన్యతను చూసుకుంటూ సినిమాల ఎంపిక చేస్తున్నాడు సుహాస్. ఇటీవలే అంబాజీ మ్యారేజ్ బ్యాండ్ మూవీతో సక్సెస్ అందుకున్న సుహాస్.. ఇప్పుడు ప్రసన్న వదనం సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకె దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 3న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటించారు.

Prasanna Vadanam Movie: ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ప్రసన్న వదనం ఎక్కడ చూడొచ్చంటే..
Prasanna Vadanam Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2024 | 12:27 PM

కలర్ ఫోటో సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు సుహాస్. మొదటి సినిమాతోనే సహజ నటనతో ఆకట్టుకున్న సుహాస్.. ఆ తర్వాత వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. ఏడాదిలో నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. కంటెంట్ ప్రాధాన్యతను చూసుకుంటూ సినిమాల ఎంపిక చేస్తున్నాడు సుహాస్. ఇటీవలే అంబాజీ మ్యారేజ్ బ్యాండ్ మూవీతో సక్సెస్ అందుకున్న సుహాస్.. ఇప్పుడు ప్రసన్న వదనం సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకె దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 3న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటించారు.

ఇన్నాళ్లు థియేటర్లలో విజయవంతంగా రన్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాను ఆహా సబ్ స్క్రైబర్స్ మాత్రం చూడలేరు. కేవలం ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవాళ్లు మాత్రమే చూసేందుకు అవకాశం ఉంది. ఇక అధికారికంగా ఈ సినిమా మే 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కానీ గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందుగానే అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన 20 రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

కథ విషయానికి వస్తే.. ఫేస్ బ్లైండ్ నెస్.. అంటే ముఖాలు కూడా గుర్తుపట్టని వ్యాధి. ఈ సమస్యతో హీరో బాధపడుతుంటాడు. డిఫరెంట్ సమస్యతో బాధపడుతున్న హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా. ఇందులో రాశి సింగ్, సుహాస్ నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.