AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaliyugam Pattanamlo OTT: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. కలియుగం పట్టణంలో స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఈ సినిమాలో విశ్వకార్తికేయ హీరోగా, విలన్ గా ద్విపాత్రాభినయం చేశాడు. మార్చి 29న థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించింది చిత్రయూనిట్. కానీ థియేటర్లు దొరక్కపోవడంతో వాయిదా పడింది. చివరకు ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేసింది చిత్రయూనిట్. నేరాలకు బీజం ఎక్కడ.. ఎలా పడుతుంది..? పిల్లలను సరిగ్గా పెంచకపోతే క్రిమినల్స్ గా మారి సొసైటీకి ఎలాంటి అనర్థాలు కలిగిస్తున్నారనే విషయానికి అటు ఫ్యామిలీ,

Kaliyugam Pattanamlo OTT: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. కలియుగం పట్టణంలో స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Kaliyugam Pattanamlo
Rajitha Chanti
|

Updated on: May 23, 2024 | 8:01 AM

Share

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో ఈమధ్య హారర్ కంటెంట్.. క్రైమ్ థ్రిల్లర్.. కామెడీ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. జనాలను ఎక్కువగా అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ తీసుకువస్తున్నారు మేకర్స్. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీటీలోకి వచ్చేసింది. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్రా శుక్లా ప్రధాన పాత్రలలో నటించిన తెలుగు మూవీ కలియుగం పట్టణంలో. ఈ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమాను ఎలాంటి అప్డేట్స్ లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఈ చిత్రానికి రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో విశ్వకార్తికేయ హీరోగా, విలన్ గా ద్విపాత్రాభినయం చేశాడు. మార్చి 29న థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించింది చిత్రయూనిట్. కానీ థియేటర్లు దొరక్కపోవడంతో వాయిదా పడింది. చివరకు ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేసింది చిత్రయూనిట్. నేరాలకు బీజం ఎక్కడ.. ఎలా పడుతుంది..? పిల్లలను సరిగ్గా పెంచకపోతే క్రిమినల్స్ గా మారి సొసైటీకి ఎలాంటి అనర్థాలు కలిగిస్తున్నారనే విషయానికి అటు ఫ్యామిలీ, ఇటు యాక్షన్ అంశాలను జోడించి ఈ సినిమా తెరకెక్కించారు.

కథ విషయానికి వస్తే.. మోహన్ (దేవీ ప్రసాద్), కల్పన (రూపలక్ష్మి) దంపతులకు విజయ్ (విశ్వ కార్తికేయ), సాగర్ (విశ్వ కార్తికేయ) కవలలు. వీరిద్దరు భిన్న మనస్తత్వాలు కలిగినవారు. ఒకరు రక్తం చూసి భయపడితే.. మరొకరు సైకోలా ఆనందపడతాడు. సైకోలా ప్రవర్తిస్తున్న తమ కుమారుడు సాగర్ బయట తిరిగితే ప్రమాదమని భావించిన అతడి తల్లిదండ్రులు చిన్న వయసులోనే ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి పంపిస్తారు. అటు విజయ్ ఉన్నత చదువులు చదువుకుంటాడు. కానీ అదే సమయంలో నంద్యాలలో జరుగుతున్న వరుస నేరాలకు సూత్రదారి ఎవరు ? విజయ్, సాగర్ ఇద్దరికీ నేరాలతో ఉన్న సంబంధం ఏంటీ అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.