Vimanam: ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైన విమానం.. ఎప్పుడు ఎక్కడంటే..
కొడుకు కలను నిజం చేయాలనుకునే ఓ తండ్రి కథే విమానం సినిమా. వికలాంగుడైనా కష్టపడి పనిచేసే మనస్తత్వమున్న వ్యక్తి వీరయ్య (సముద్రఖని). భార్య మరణించడంతో తన కొడుకు రాజు (ధృవన్)తోకలిసి ఓ బస్తీలో జీవనం సాగిస్తుంటాడు. ఆటోస్టాండ్ దగ్గర మరుగుదొడ్ల నిర్వహణతో వచ్చే చాలీ చాలని సంపాదనే ఆ కుటుంబానికి ఆధారం. బడికి వెళ్లే రాజుకు విమానం అంటే చాలా ఇష్టం.
విలక్షణ నటుడు సముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ చిత్రం విమానం. ఈ సినిమాలో మాస్టర్ ధృవన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ కీలకపాత్రలలో నటించారు. డైరెక్టర్ యానాల శివప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి నిర్మించారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా తండ్రి, కొడుకుల సెంటిమెంట్ తో ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది. లేటేస్ట్ సమాచారం ప్రకారం జూన్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
కథ విషయానికి వస్తే.. కొడుకు కలను నిజం చేయాలనుకునే ఓ తండ్రి కథే విమానం సినిమా. వికలాంగుడైనా కష్టపడి పనిచేసే మనస్తత్వమున్న వ్యక్తి వీరయ్య (సముద్రఖని). భార్య మరణించడంతో తన కొడుకు రాజు (ధృవన్)తోకలిసి ఓ బస్తీలో జీవనం సాగిస్తుంటాడు. ఆటోస్టాండ్ దగ్గర మరుగుదొడ్ల నిర్వహణతో వచ్చే చాలీ చాలని సంపాదనే ఆ కుటుంబానికి ఆధారం. బడికి వెళ్లే రాజుకు విమానం అంటే చాలా ఇష్టం. పైలట్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అయితే పెద్దయ్యాక కాకుండా నెల రోజుల్లోనే విమానం ఎక్కించాల్సిన అవసరం వస్తుంది. దీంతో తన కొడుకుని ఎలాగైనా విమానం ఎక్కించాలని నిర్ణయించుకుంటాడు వీరయ్య.
ఇక తన కొడుకు కోరికను నెరవేర్చేందుకు ఆ తండ్రి ఏం చేశాడు ?.. అసలు అంత అవసరం ఏంటీ ?… అదే బస్తీలో ఉండే సుమతి (అనసూయ), కోటి (రాహుల్ రామకృష్ణ ) డేనియర్ (ధనరాజ్ )లో జీవితాల వెనక ఉన్న కథేమిటీ ?. వీరందరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది చిత్రం. ఇప్పటివరకు థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమవుతుంది.