Maharaja: ఓటీటీలో విజయ్ సేతుపతి మూవీ సరికొత్త రికార్డు.. ఇండియా వైడ్‌గా ఇంకా ట్రెండింగ్‌లోనే.. ఎక్కడ చూడొచ్చంటే?

మక్కల్ సెల్వన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన తాజా మహారాజ. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 14న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం మౌత్ టాక్ తోనే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది మహారాజా సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తోంది.

Maharaja: ఓటీటీలో విజయ్ సేతుపతి మూవీ సరికొత్త రికార్డు.. ఇండియా వైడ్‌గా ఇంకా ట్రెండింగ్‌లోనే.. ఎక్కడ చూడొచ్చంటే?
Maharaja Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 12, 2024 | 8:59 PM

మక్కల్ సెల్వన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన తాజా మహారాజ. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 14న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం మౌత్ టాక్ తోనే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది మహారాజా సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తోంది. ‘మహారాజా’ చిత్రం జూలై 14న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అంతకు ముందు థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా దాదాపు 100 కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కొత్త రికార్డులను సృష్టించింది. హద్దులు దాటి కోట్లాది మంది ప్రేక్షకులకు చేరువైన ‘మహారాజా’ సినిమా సినీ ప్రేమికుల హృదయాలను హత్తుకుంది. ఈ ఏడాది అత్యధిక మంది వీక్షించిన ఆంగ్ల భాషా చిత్రంగా ‘మహారాజా’ రికార్డు సృష్టించింది. అంతే కాదు, భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా కూడా మహారాజా గుర్తింపు పొందింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం టాప్ 10 జాబితాలోనే కొనసాగుతుండడం విశేషం.

ఇవి కూడా చదవండి

మహారాజా’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మొదటి వారంలో రికార్డులు కొల్లగొట్టడం ప్రారంభించింది. ఆ తర్వాత 1.5 కోట్ల స్ట్రీమింగ్ హవర్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మహారాజా’ విడుదలయ్యే వరకు, ఈ సంవత్సరం నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రం ‘లపాటా లేడీస్’. కానీ ఈ సినిమాను కూడా ‘మహారాజా’ అధిగమించింది ‘మహారాజా’ సినిమాలో విజయ్ సేతుపతి, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, అభిరామి, భారతి రాజా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. విరూపాక్ష, కాంతార, మంగళవారం వంటి సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోక్ నాథ్ మహారాజ సినిమాకు స్వరాలు సమకూర్చడం విశేసం. మరి థియేటర్లలో విజయ్ సేతుపతి సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.