Chhaava OTT: తెలుగులో స్ట్రీమింగ్కు ఛావా.. ఒక్కరోజు ఆలస్యంగా ఆ ఓటీటీలోకి..
ఇటీవల బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా ఛావా. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 11నే ఈ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీ అడియన్స్ ముందుకు వచ్చింది. తాజాగా తెలుగు వెర్షన్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్.

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం ఛావా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విక్కీ కౌశల్ కెరీర్ లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ప్రతి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టేలా చేసింది. ఎమోషనల్ కంటెంట్ తోపాటు గ్రాండ్ విజువల్స్, శక్తివంతమైన నటనతో ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల అడియన్స్ ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. థియేటర్లలో భారీ సక్సెస్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ఏప్రిల్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే నిన్న కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ అయ్యింది. దీంతో అడియన్స్ చాలా వరకు డిజప్పాయింట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఛావా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, హిందీ వెర్షన్ సైతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :