ఆంటీలను లైన్‌లో పెట్టే ఆటగాడు.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు.. ఎక్కడ చూడొచ్చంటే
చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఒక చిత్రం ఈ ఏడాది విడుదలైంది. యాక్షన్, రొమాన్స్ కాదు.. కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.. ఈ సినిమా అన్ని జోనర్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి

ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు.. థియేటర్స్ లో కొత్త సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. చిన్న సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు కూడా విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక థియేటర్స్ లో విడుదలయ్యే సినిమాలతో పాటు ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీలో ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఓటీటీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి చూసే సినిమాల లిస్ట్ లో రొమాంటిక్, హారర్, థ్రిల్లర్ సినిమాలు ఫస్ట్ ఉంటాయి. ఇక ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నసినిమాలో ఇప్పుడు ఓ సినిమా ఆడియన్స్ ను ఉర్రుతలూగిస్తుంది. ఈ సినిమాను రొమాంటిక్ మాత్రమే కాదు ఓ థ్రిల్లర్, ఫాంటసీ సినిమా కూడా..
ఈ సినిమా చూసిన వాళ్లంతా ఇదెక్కడి సినిమారా బాబు అని షాక్ కు గురవుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన రొమాంటిక్ సినిమాల్లో ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ సినిమాలో హీరో ఆంటీలవర్. ఈ సినిమాలో హీరో తెలివిగా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అయితే మనోడు ఆంటీలను లైన్ లో పెడుతుంటాడు. డబ్బున్న ఆంటీలను టార్గెట్ చేసి వారిని వలలో వేసుకుంటాడు. ఆతర్వాత వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తుంటాడు. అయితే ఓసారి అతనికి ఊహించని సంఘటన జరుగుతుంది. దాంతో అతను ఊరు ఒదిలి పెట్టి వెళ్లిపోవాల్సి వస్తుంది.
ఊరు నుంచి పారిపోయి ఓ ఇంట్లో తలదాచుకుంటాడు. అయితే ఆ ఇంట్లో కూడా అతను ఊహించని సంఘటనలు ఎదుర్కొంటాడు. ఈ సినిమాలోని కథకు రామాయణంలోని అహల్య మోక్షం కథను లింక్ చేసి చూపించారు. ఇక ఆయా ఇంట్లో రహస్యాలను అతను బయటకు తీస్తుంటాడు. ఈ క్రమంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఈ సినిమాలో క్రైమ్, ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్ అన్ని కలిసి ఉంటాయి. ఈ సినిమా పేరు మార్జార ఒరు కల్లువచ్చ నున. ఈ సినిమా మలయాళంలో తెరకెక్కింది. ఈ సినిమాను సైనా ప్లే ఓటీటీలో చూడొచ్చు. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..