Rana Naidu Teaser: రానా నాయుడు టీజర్ వచ్చేసింది.. అదరగొట్టిన వెంకటేష్.. రానా..

ఇక తండ్రి పాత్రలో వెంకీ వృద్ధుడిగా కనిపించి మెప్పించారు. వీరిద్దరు కలిసి చేస్తున్న మొదటి సిరీస్ కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‏ను అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‏కు రీమేక్‏గా తెరకెక్కించారు.

Rana Naidu Teaser: రానా నాయుడు టీజర్ వచ్చేసింది.. అదరగొట్టిన వెంకటేష్.. రానా..
Rana Venkatesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 24, 2022 | 4:08 PM

విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati) కలిసి నటిస్తోన్న లేటేస్ట్ వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu ). ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫిక్స్ ఈ సిరీస్‏ను నిర్మిస్తోంది. యాక్షన్, క్రైమ్ నేపథ్యంలో రాబోతున్న సిరీస్‏లో వీరిద్దరు తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా రానా నాయుడు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సాయం కావాలా ? అంటూ రానా సంబాషణలతో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక తండ్రి పాత్రలో వెంకీ వృద్ధుడిగా కనిపించి మెప్పించారు. వీరిద్దరు కలిసి చేస్తున్న మొదటి సిరీస్ కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‏ను అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‏కు రీమేక్‏గా తెరకెక్కించారు.

దీనిని కరణ్ అన్షుమాన్, సూపర్ణ్ వర్మ సంయుక్తంగా రూపొందించారు. పూర్తి సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్‏తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. లోకోమోటీవ్ గ్లోబల్ మీడియా బ్యానర్ పై సుందర్ ఆరోన్ నిర్మించిన ఈ సిరీస్ లో సుర్వీన్ చావ్లా, సుశాంక్ సింగ్, అశీష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిల్లై తదితరులు కీలకపాత్రలలో నటించారు. త్వరలోనే ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.