AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cobra Movie: విక్రమ్‌ కోబ్రా ఓటీటీలోకి వచ్చేస్తోంది.. అధికారికంగా తేదీ ప్రకటన.. కానీ చిన్న ట్విస్ట్‌.. 

Cobra Movie: విక్రమ్‌ (Vikram) హీరోగా వచ్చిన చిత్రం 'కోబ్రా'. ఆగస్టు 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా విక్రమ్‌ డిఫ్రంట్‌ గెటప్స్‌తో ఆకట్టుకున్నాడు. మది పాత్రలో...

Cobra Movie: విక్రమ్‌ కోబ్రా ఓటీటీలోకి వచ్చేస్తోంది.. అధికారికంగా తేదీ ప్రకటన.. కానీ చిన్న ట్విస్ట్‌.. 
Cobra Movie
Narender Vaitla
|

Updated on: Sep 24, 2022 | 7:21 AM

Share

Cobra Movie: విక్రమ్‌ (Vikram) హీరోగా వచ్చిన చిత్రం ‘కోబ్రా’. ఆగస్టు 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా విక్రమ్‌ డిఫ్రంట్‌ గెటప్స్‌తో ఆకట్టుకున్నాడు. మది పాత్రలో తనదైన నటనతో మెస్మరైజ్‌ చేశాడు విక్రమ్‌. అంతేకాకుండా ఈ చిత్రంలో ఇంటర్‌ పోల్‌ అధికారి అస్లాన్‌ పాత్రలో మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. థియేటర్‌లో విడుదలైన నెల రోజులకే సినిమా ఓటీటీలో విడుదల కానుంది. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్‌ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోనీ లివ్‌ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా పంచుకుంది. కొత్త ట్రైలర్‌తో పాటు ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్‌ ఉంది. సినిమా ఓటీటీ విడుదలను ప్రకటించినప్పటికీ ఏయే భాషల్లో స్ట్రీమింగ్‌ ఉంటుందనే విషయాన్ని మాత్రం తెలపలేదు. అయితే సోనీ లివ్‌ యాప్‌లో మాత్రం ఈ సినిమా తమిళ్‌ వెర్షన్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో విక్రమ్‌కు జోడిగా కేజీఎఫ్‌ ఫేమ్‌.. శ్రీనిధి శెట్టి నటించిన విషయం తెలిసిందే. లెక్కల మాస్టారుగా ఉన్న మది.. నేరాలు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన