Bad Newz OTT: ఓటీటీలోకి యానిమల్ బ్యూటీ ‘బ్యాడ్ న్యూజ్’.. త్రిప్తి డిమ్రీ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ ఎక్కడంటే..
అలాగే ఇటు తెలుగులో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రిప్తి నటించిన లేటేస్ట్ మూవీ బ్యాడ్ న్యూజ్. గత నెలలో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
యానిమల్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ పాత్రే అయినా అందం, గ్లామర్ డోస్ తో తెగ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం పూర్తైనా.. ఈ అమ్మడు యానిమల్ సినిమాతో బ్రేక్ వచ్చింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించగా.. త్రిప్తి డిమ్రీ కీలకపాత్రలో మెరిసింది. ఈ సినిమా తర్వాత హిందీలో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అలాగే ఇటు తెలుగులో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రిప్తి నటించిన లేటేస్ట్ మూవీ బ్యాడ్ న్యూజ్. గత నెలలో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
బ్యాడ్ న్యూజ్ చిత్రంలో త్రిప్తి డిమ్రీ, విక్కీ కౌశల్, అమీ విర్క్ ప్రధాన పాత్రలు పోషించగా.. ఆనంద్ తివారి దర్శకత్వం వహించారు. బోల్డ్ కంటెంట్‌తో రూపొందించిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349)తో అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన సినిమా ఇప్పుడు ఓటీటీల దూసుకుపోవడం ఖాయమంటున్నారు.
జీవితంలో ఎంతో సాధించాలని కలలు కనే అమ్మాయి అనుకోకుండా పెళ్లి చేసుకోవడం.. మరొకరితో ఎఫైర్ పెట్టుకోవడం.. చివరికి వాళ్లిద్దరి కారణంగా తల్లి కావడం అనే క్యాప్షన్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇద్దరు తండ్రులు ఈ సంఘటనను ఎలా స్వీకరించారు ? .. తమ బిడ్డ కోసం ఏం చేశారు అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో నేహా ధూపియా సైతం కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.