Telugu Indian Idol 3: నా కొడుకు వల్ల గొడవలే ఎక్కువగా వచ్చేవి.. అల్లరిగా ఉండేవాడు.. థమన్ తల్లి కామెంట్స్..

తాజాగా ఈ శుక్రవారం ఎపిసోడ్ కోసం మ్యూజిక్ తమన్ మదర్ ఘంటసాల సావిత్రి తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేశారు. ఓటీటీలో సింగింగ్ షో కోసం తొలిసారి వేదికపైకి వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా. అందులో తన తనయుడు తమన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇంత మంచి కొడుకు పుట్టాడంటూ తన కొడుకుపై ప్రేమను కురిపించింది.

Telugu Indian Idol 3: నా కొడుకు వల్ల గొడవలే ఎక్కువగా వచ్చేవి.. అల్లరిగా ఉండేవాడు.. థమన్ తల్లి కామెంట్స్..
Thaman
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 30, 2024 | 12:52 PM

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా అందిస్తోన్న అద్భుతమైన కార్యక్రమాల్లో తెలుగు ఇండియ్ ఐడల్ ఒకటి. ఇప్పటివరకు విజయవంతగా రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు మూడో సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సీజన్‏కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్ గీతా మాధురి, సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి అద్భుతమైన పాటలతో ఆకట్టుకుంటున్నారు కంటెస్టెంట్స్. తాజాగా ఈ శుక్రవారం ఎపిసోడ్ కోసం మ్యూజిక్ తమన్ మదర్ ఘంటసాల సావిత్రి తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేశారు. ఓటీటీలో సింగింగ్ షో కోసం తొలిసారి వేదికపైకి వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా. అందులో తన తనయుడు తమన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇంత మంచి కొడుకు పుట్టాడంటూ తన కొడుకుపై ప్రేమను కురిపించింది.

ప్రస్తుతం ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రసవత్తరంగా జరుగుతోంది. ప్రతి వారం ఎపిసోడ్ అభిమానులకు థ్రిల్ పంచుతుంది.. ఇప్పుడీ మెగా మ్యూజిక్ షోలో మరో స్పెషల్ మూమెంట్ వచ్చేసింది. ఈ షోకి జడ్జ్ గా ఉంటున్న సెన్సేషనల్ కంపోజర్ తమన్ మదర్ ఘంటసాల సావిత్రి ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. దీనికి సంబధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తమన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ తమన్ చిన్నప్పటి ముచ్చట్లు చెప్పారు.

తమన్ చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో కన్నా మైదానంలోనే ఎక్కువగా ఉండేవాడని, తనకి అస్సలు భయం లేదని, స్కూళ్లలో గొడవలు వచ్చేవని చెప్పారు. తమన్ ఎక్కడ ఉన్న క్రికెట్ గ్రౌండ్ కు వెళ్లాల్సిందేనని.. చాలా అల్లరి చేసేవాడని తెలిపింది. స్కూల్లో తన తొటి పిల్లల టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చేసి తినేసేవాడని కంప్లయింట్‏లు ఉండేవని అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కానీ ఎంతో హార్డ్ వర్కర్ చేస్తాడని, మొదలు పెట్టిన పని పూర్తయ్యే వరకు తిండి కూడా పట్టించుకోడని, సంగీతం క్రికెట్ తప్ప తనకి మరో ప్రపంచం లేదని చెప్పుకొచ్చారు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇంత మంచి కొడుకు పుట్టాడని ఎమోషనల్ అయ్యారు. ఈ ఎమోషనల్ అండ్ హార్ట్ టచ్చింగ్ ఎపిసోడ్ ఆహాలో శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారంకానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.