AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు బాడీ షేమింగ్‌తో ట్రోల్స్ చేశారు.. ఇప్పుడు ఈ వయ్యారి సినిమా కోసం ఎదురుచూపులు..

చీరకట్టుతో ఇన్ స్టాలో రీల్ వీడియోస్ చేస్తూ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఆమె అందమైన వీడియోస్ డైరెక్టర్ ఆర్జీవీ కంటపడ్డాయి. దీంతో ఆమె గురించి వరుసగా పోస్టులు పెట్టిన వర్మ... చివరకు ఆరాధ్య దేవితో శారీ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ నెట్టింట తెగ వైరలయ్యాయి. శారీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే శ్రీలక్ష్మికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరిగింది.

Tollywood: ఒకప్పుడు బాడీ షేమింగ్‌తో ట్రోల్స్ చేశారు.. ఇప్పుడు ఈ వయ్యారి సినిమా కోసం ఎదురుచూపులు..
Aardhya Devi
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2024 | 12:57 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం. టాలెంట్ ఉన్న ఎందికి లైఫ్ ఇచ్చింది. కొందరు డ్యాన్స్ అదరగొట్టేస్తుంటే.. మరికొందరు సింగింగ్.. పెయింటింగ్, యాక్టింగ్ ఒక్కటేమిటీ ఎంతో మంది ప్రతిభావంతులు తమ టాలెంట్ తో పాపులర్ అవుతున్నారు. అయితే కాస్త అందం, యాక్టింగ్ పై ఆసక్తి ఉన్నవారు ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇటీవల డాన్స్ రీల్స్ చేసి ఏకంగా హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటున్నవారి గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే ప్రభాస్ సరసన ఇమాన్వీ ఛాన్స్ కొట్టేసింది. కానీ అంతకు ముందే మరో అమ్మాయి ఒక్క వీడియోతోనే కథానాయికగా అవకాశం దక్కించుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. తనే శ్రీలక్ష్మీ సతీష్.. ఈ పేరు అంతగా ఫేమస్ కాలేదు… కానీ ఆర్జీవీ ఆరాధ్య దేవి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. చీరకట్టుతో ఇన్ స్టాలో రీల్ వీడియోస్ చేస్తూ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఆమె అందమైన వీడియోస్ డైరెక్టర్ ఆర్జీవీ కంటపడ్డాయి. దీంతో ఆమె గురించి వరుసగా పోస్టులు పెట్టిన వర్మ… చివరకు ఆరాధ్య దేవితో శారీ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ నెట్టింట తెగ వైరలయ్యాయి. శారీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే శ్రీలక్ష్మికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరిగింది.

ఇదిలా ఉంటే యూత్ ఆరాధ్య దేవి ఇప్పుడు శారీ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ తెగ వైరల్ అయ్యాయి. ఈ అమ్మాయి నెట్టింట చాలా యాక్టివ్. ఎప్పుడూ ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తుంది. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. గతంలో ఫ్యాన్స్ అడిగిన అనేక విషయాలకు ఆన్సర్స్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె కళ్లు, నడుము, వయసు గురించి ప్రశ్నించగా.. తన గురించిన వివరాలను చెప్పేసింది. ప్రస్తుతం ఆరాధ్యే దేవి వయసు 22. అలాగే తనకు ఇప్పుడిప్పుడే తెలుగు కొద్దిగా వస్తుందని.. శారీ మూవీ కోసం హైదరాబాద్ లో ఉంటుంది. ఇక ఈ అమ్మాయి హైట్ 5 ఫీట్స్ 8 ఇంచెస్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం చాలా ఫేమస్ అయిన ఆరాధ్య దేవి ఒకప్పుడు బాడీషేమింగ్ కామెంట్స్ ఎదుర్కొవాల్సి వచ్చిందట. అలాగే తన కలర్, శారీరాకృతి గురించి విమర్శలు వచ్చాయని.. ఈ క్రమంలో ఎన్నో త్యాగాలు చేశానని.. కష్టమైన వర్కౌట్స్ చేసి అందంగా మారినట్లు చెప్పుకోచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..