AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అమ్మా బాబోయ్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరంటే..

అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అమాయకమైన నటనతో అడియన్స్ హృదయాలను దోచేసింది. దీంతో తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంటుంది అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ రాలేదు. దీంతో కోలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగింది.

Tollywood: అమ్మా బాబోయ్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరంటే..
Actress
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2024 | 8:55 AM

Share

తెలుగు సినీ రంగంలో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయ్యింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అమాయకమైన నటనతో అడియన్స్ హృదయాలను దోచేసింది. దీంతో తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంటుంది అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ రాలేదు. దీంతో కోలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగింది. చాలా కాలం క్రితమే సినిమాలకు దూరమైన ఓ సీనియర్ లేటేస్ట్ లుక్ ఇప్పుడు అందరికీ షాకిస్తుంది. ఒకప్పుడు నిండు చందమామలా కనిపించిన ఆ హీరోయిన్ ఇప్పుడు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పైన ఫోటోలో చూశారు కదా.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తెలుగు ప్రజలకు చాలా సుపరిచితం. అంతేకాదు.. అప్పట్లో కుర్రాళ్ల ఆరాద్య దేవత. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? తనే గాయత్రి రాఘురామ్. ఈ పేరు అసలు ఎవరికీ తెలియదు. కానీ ‘మా బాపు బొమ్మకు పెళ్లంట’ సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీతో అంతగా క్రేజ్ సొంతం చేసుకుంది.

గాయత్రి రఘురామ్.. తెలుగులో రేపల్లెలో రాధ సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. 2001లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత విడుదలైన మా బాపు బొమ్మకు పెళ్లంట మూవీతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ వచ్చింది. 2003లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలోని ‘మాటలే రాని వేళ పాట ఎలా పాడను ‘ సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ యూట్యూబ్‍లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంటుంది.ఈ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. కానీ ఆ తర్వాత ఆఫర్స్ తగ్గిపోవడంతో సైలెంట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

తెలుగు, తమిళంతోపాటు మలయాళంలోనూ నటించింది. తెలుగులో 2004 నుంచి 2010 వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. హీరోయిన్ ఆఫర్స్ తగ్గడంతో సహాయ పాత్రలలో నటించింది. అంతేకాదు గాయత్రి రఘురామ్ కొరియోగ్రాఫర్ కూడా. 2006లో కాలిఫోర్నియాలోని యూఎస్ ఆధారిత సాఫ్ట్ వేర్ కంపెనీ ఇంజనీర్ దీపక్ చంద్రశేఖర్ ను వివాహం చేసుకుంది. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2010లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న గాయత్రి.. 2014లో బీజేపీలో చేరింది. కొద్ది రోజుల క్రితమే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చింది.

Gayathri

Gayathri

ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది గాయత్రి రఘురామ్. ఇప్పుడు ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. కొందరు ఆమె లుక్ పై పాజిటివ్ కామెంట్స్ చేసినా.. మరికొందరు మాత్రం భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. 2017లో తమిళ్ బిగ్ బాస్ షోలో పాల్గొంది. అమెరికాలో విజువల్ కమ్యూనికేషన్ లా పూర్తి చేసిన గాయత్రి కథానాయికగా కాకుండా 100 సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసింది. ప్రస్తుతం గాయత్రి రఘురామ్ న్యూలుక్ ఫోటోస్ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.