Horror Series: వామ్మో.. ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా అస్సలు చూడలేరు.. ఒక్కో సీన్‌కు గుండె గుభేల్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..
అదే Betaal. అంతగా ఆద్యంతం వణుకుపుట్టించే హారర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ అవుతుంది. 2020లో విడుదలైన ఈ సిరీస్ ఇప్పటికీ ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. దీనిని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ లో సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.
సాధారణంగా చాలామందికి హారర్ సినిమాలు చూడాలంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు అలాంటి వారికోసమే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హారర్ మూవీస్, వెబ్ సిరీస్, మర్డర్ మిస్టరీ చిత్రాలను తీసుకువస్తున్నాయి. రొమాంటిక్ కామెడీ కంటెంట్ కాకుండా అనుక్షణం ఊహించని ట్విస్టులతో భయపెట్టించే చిత్రాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మీకు హారర్, దెయ్యాల చిత్రాలను చూడడం అలవాటు ఉన్నప్పటికీ ఈ వెబ్ సిరీస్ మాత్రం ఒంటరిగా అస్సలు చూడలేరు. మొత్తం 4 ఎపిసోడ్స్ ఉన్న హారర్ థ్రిల్లర్ సిరీస్ చూడాలంటే గుండెల్లో ధైర్యం ఉండాల్సిందే.. అలాగే మీ పక్కన స్నేహితులు కూడా ఉండాల్సిందే. అదే Betaal. అంతగా ఆద్యంతం వణుకుపుట్టించే హారర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ అవుతుంది. 2020లో విడుదలైన ఈ సిరీస్ ఇప్పటికీ ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. దీనిని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ లో సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.
ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఒక గిరిజనుడు గుడిలో పూజలు చేస్తుంటాడు. అదే గ్రామంలోని కొందరు అమ్మాయిలు దెయ్యాలతో మాట్లాడుతుంటారు. ఈ గ్రామానికి దగ్గరగా ఓ సొరంగం ఉంటుంది. దానిని తెరవాలని అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.. కానీ ఆ సొరంగం తెరవకుండా దేవుడు ఆపుతున్నాడని ఓ మహిళ చెబుతుంది. ఆ సొరంగాన్ని తెరిచి దాని గుండా జాతీయ రహదారిని నిర్మించి రవాణా ప్రారంభించాలని భావించిన ప్రభుత్వం కొందరు అధికారులను ఆ గ్రామానికి పంపుతుంది. కానీ అక్కడే గ్రామస్తులు ప్రభుత్వానికి ఎదురుతిరుగుతారు. దీంతో ప్రభుత్వం పంపిన దళాలు గ్రామస్తులను చెదరగొట్టి ఆ సొరంగాన్ని పగలగొట్టేందుకు స్టార్ట్ చేస్తారు.
ఇక అసలైన ట్విస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ సొరంగం నుంచి ఒక భయంకరమైన బ్రిటిష్ సైన్యం బయటకు వస్తుంది. చూసేందుకు క్రూరంగా కనిపించే ఆ దెయ్యాలతో అసలైన యుద్ధం ఉంటుంది. ఇక ఈ సిరీస్ క్లైమాక్స్ చూస్తే మాత్రం మీ గుండె అరచేతిలో పట్టుకోవాల్సిందే. క్రూరమైన మనుషులుగా రక్తంతో నిండిన ముఖాలు.. శరీరాలపై కాలిన గాయాలతో.. ఆ దృశ్యాలు వర్ణనాతీతం. ఈ సిరీస్ ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.