Bigg Boss Ott Telugu: బిగ్‌బాస్ ఓటీటీ సందడి షూరు కానుంది.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఫిక్స్ !.. ఎవరెవరో తెలుసా..
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోకు అన్ని భాషల్లో ఆదరణ ఎక్కువగానే
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోకు అన్ని భాషల్లో ఆదరణ ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్లు ఘనంగా పూర్తిచేసుకుంది. అయితే ఇప్పటివరకు బుల్లితెరపై అలరించిన ఈ షో.. ఇకపై డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ ప్రేక్షకులకు అసలైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్దమవుతుంది. సీజన్ 5 గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున బిగ్‌బాస్ ఓటీటీకి గురించి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో బిగ్‌బాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించారు. దీంతో సీజన్ 6 రాబోతుందని అంతా అనుకున్నారు. కానీ ఓటీటీలో బిగ్‌బాస్ షో రాబోతుందని.. దానికి కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారని ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ షోలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ నెట్టింట్లో టాక్ నడుస్తోంది. అందులో యాంకర్ వర్షిణి, యాంకర్ శివ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు.. సాఫ్ట్ వేర్ డెవలపర్ ఫేమ్ వైష్ణవి, వరంగల్ వందన షార్ట్ ఫిలింస్‌తో పాపులరైన వందన, ఢీ 10 విజేత రాజు, టిక్ టాక్ స్టార్ దుర్గరావు కూడా పాల్గోననున్నట్లుగా సమాచారం. ఇక ఓటీటీలో బిగ్‌బాస్ షో కేవలం గంట షో మాత్రమే కాకుండా 24 గంటలు లైవ్ రానున్నట్లుగా ఇప్పటికే నాగార్జున అనౌన్స్ చేశారు. అలాగే గత సీజన్ 5కు ఉపయోగించిన బిగ్‌బాస్ ఇంటినే కొన్ని మార్పులు చేసి బిగ్‌బాస్ ఓటీటీకి వినియోగించనున్నట్లుగా టాక్. బిగ్‌బాస్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్ మసాలా సాంగ్స్.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..