AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ హీరోయిన్‏కు తెలుగులో ఫుల్ క్రేజ్.. జూనియర్ సౌందర్య అనేస్తుంటారు.. ఎవరో గుర్తుపట్టారా ? ..

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్‏కు సంబంధించిన రేర్ ఫోటోస్.. చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

Viral Photo: ఈ హీరోయిన్‏కు తెలుగులో ఫుల్ క్రేజ్.. జూనియర్ సౌందర్య అనేస్తుంటారు.. ఎవరో గుర్తుపట్టారా ? ..
Actress
Rajitha Chanti
|

Updated on: Dec 30, 2021 | 2:54 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్‏కు సంబంధించిన రేర్ ఫోటోస్.. చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సెలబ్రెటీలు సైతం ఎప్పటికప్పుడు తమ లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటారు. తాజాగా పైన ఉన్న ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. హిమపాతాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో భారీగా ఫాలోయింగ్ ఉంది. యూత్‏లో మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్‏ నుంచి కూడా ఈ బ్యూటీకి ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. మొదటి సినిమాతోనే పక్కింటి అమ్మాయిగా కనిపించి తన నటనతో ఆడియన్స్‏ను అలరించింది. అతి తక్కువ సమయంలోనే ఈ హీరోయిన్ టాప్ హీరోయిన్స్‏లలో ఒకరిగా దూసుకుపోతుంది. తనకు నచ్చే.. తాను మనస్పూర్తిగా చేయగలిగే పాత్రలను.. చిత్రాలను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్‏గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. గుర్తుపట్టండి..

పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ గ్లామర్ పాత్రలకు చాలా దూరంగా ఉంటుంది. తనకు నచ్చిన.. తను కంఫర్ట్‏బుల్‏గా ఉండే రోల్స్ మాత్రమే చేస్తానని.. స్పెషల్ సాంగ్స్ అస్సలు చేయనని తెగేసి చెప్పింది. తను సినిమాల్లో కనిపించే విధానం కూడా ఎంతో సంప్రదాయబద్ధంగా ఉంటోంది. ఏమాత్రం గ్లామర్ షో చేయకుండా కేవలం నటనకు, పాత్రకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది ఈ హీరోయిన్. గుర్తుపట్టరా ఎవరో.. తను మరెవరో కాదండోయ్.. న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి. ఇటీవల తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల సూపర్ హిట్ చిత్రం లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి.. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ద్వారా ప్రేక్షకులను మరోసారి తన నటనతో ఆకట్టుకుంది.

Also Read: Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ్‌లో దూసుకుపోతుంది… గుర్తుపట్టారా..?

Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు.. అందమైన ప్రేమ కథగా రాబోతున్న సినిమా..

Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్‌ మసాలా సాంగ్స్‌.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..