Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు.. అందమైన ప్రేమ కథగా రాబోతున్న సినిమా..

టాలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మోహనకృష్ణ ఇంద్రగంటి. అష్టాచమ్మ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా ఇంద్రగంటి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Sudheer Babu: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అంటున్న సుధీర్ బాబు.. అందమైన ప్రేమ కథగా రాబోతున్న సినిమా..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 22, 2022 | 7:10 PM

Sudheer Babu: టాలీవుడ్‌లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మోహనకృష్ణ ఇంద్రగంటి. అష్టాచమ్మ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా ఇంద్రగంటి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆతర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు సుధీర్ బాబుతో కలిసి సినిమాకి చేస్తున్నారు మోహన్ కృష్ణ. ఇప్పటికే సుధీర్ బాబుతో కలిసి సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించారు ఇంద్రగంటి. వీటి సమ్మోహనం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆకట్టుకునే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఆతర్వాత వచ్చిన వి సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. వి సినిమాలో నాని , సుధీర్ బాబు కలిసి నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికి సుధీర్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా చేయనున్నాడు.

సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో.. బెంచ్ మార్క్ స్టూడియోస్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”.  సినిమాకు నిర్మాణ‌ భాగస్వామిగా మైత్రీ మూవీమేకర్స్ వ్యవహరిస్తోంది. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్‌ను ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాకు నిర్మాణ భాగ‌స్వామిగా ఆహ్వానించడం గర్వంగా ఉందని మెంచ్ మార్క్ స్టూడియోస్ ప్రకటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్, అందమైన ప్రేమ కథగా రాబోతోన్న ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. గతంలో సమ్మోహనం లాంటి ప్రేమ కథతో మెప్పించిన ఇంద్రగంటి.. ఇప్పుడు కూడా అలాంటి కథనే సినిమాకోసం రాసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా స్కోప్ ఉంటుందని అంటున్నారు. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లొకి రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను త్వరలోనే చిత్రయూనిట్ విడుదల చేయనుంది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..

RRR: కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. రామ్ చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. జై చరణ్ అంటూ..

Sai Pallavi: ఎర్రచీరలో మందార పువ్వులా మెరిసిన సాయి పల్లవి.. చూసేందుకు రెండు కళ్లు చాలవే..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?