AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీలో దుమ్ము రేపుతోన్న రియల్ క్రైమ్ స్టోరీ.. ఏకంగా 18 దేశాల్లో ట్రెండింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

'ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌' 'కర్రీ అండ్‌ సైనైడ్‌: ది జాలీ జోసెఫ్‌ కేస్‌' వంటి డాక్యుమెంటరీ సిరీస్ లకు ఓటీటీలో మంచి స్పందన వచ్చింది. ఇప్పుడిదే జాబితాలో 'ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’. 2015లో దేశవ్యాప్తంగా సంచలనమైన షీనా బోరా హత్య కేసుపై ఈ డాక్యుమెంటరీ క్రైమ్‌ సిరీస్ తెరకెక్కింది. కోర్టులో కేసుల వల్ల ఆలస్యమైనా ఎట్టకేలకు ఫిబ్రవరి 29వ తేదీన..

ఓటీటీలో దుమ్ము రేపుతోన్న రియల్ క్రైమ్ స్టోరీ.. ఏకంగా 18 దేశాల్లో ట్రెండింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
The Indrani Mukerjea Story
Basha Shek
|

Updated on: Mar 10, 2024 | 12:15 PM

Share

ఇటీవలి ఓటీటీల్లో డాక్యుమెంటరీ సిరీస్‍లకు బాగా క్రేజ్ పెరుగుతోంది. ఆడియెన్స్ వీటిని చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తుండడంతో రికార్డ్ వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా యదార్థ సంఘటనలు, సంచలన కేసుల ఆధారంగా రూపొందిన క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్‍లకు ఓటీటీల్లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌’ ‘కర్రీ అండ్‌ సైనైడ్‌: ది జాలీ జోసెఫ్‌ కేస్‌’ వంటి డాక్యుమెంటరీ సిరీస్ లకు ఓటీటీలో మంచి స్పందన వచ్చింది. ఇప్పుడిదే జాబితాలో ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’. 2015లో దేశవ్యాప్తంగా సంచలనమైన షీనా బోరా హత్య కేసుపై ఈ డాక్యుమెంటరీ క్రైమ్‌ సిరీస్ తెరకెక్కింది. కోర్టులో కేసుల వల్ల ఆలస్యమైనా ఎట్టకేలకు ఫిబ్రవరి 29వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‍ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళ తదితర భాషల్లోనూ ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ స్ట్రీమింగ్ అవుతోంది. యదార్థ సంఘటనలతో తెరకెక్కిన ఈ సిరీస్ కు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది. కేవలం భారత్ లోనే కాకుండా ఆస్ట్రేలియా, కెనడా తో సహా సుమారు 18 దేశాల్లో ఈ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. అంతేకాదు నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‍లో టాప్-7లోనూ ఈ క్రైమ్ సిరీస్ నిలిచింది. అంతేకాదు వారంలోనే ఈ డాక్యు సిరీస్‍కు 2.2 మిలియన్లపైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 6.9 మిలియన్ వాచ్ హవర్స్ దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

అసలు ఏముందబ్బా.. ఇందులో

మొత్తానికి ది ఇంద్రాణి ముఖర్జీయా డాక్యుమెంటరీ సిరీస్ అంచనాలకు మించి ఆదరణ దక్కించుకుంటోంది. షీనా బోరా హత్య కేసులో ఎవరూ ఊహించని ట్విస్టులు ఉండడం, అందుకు తగ్గట్టుగానే ఈ క్రైమ్ సిరీస్ లో చూపించడంతో దీనికి భారీ వ్యూస్ వస్తున్నాయి. ఉరార్‌‌, షానా లెవీ తెరకెక్కించిన ది ఇంద్రాణి ముఖర్జియా సిరీస్ మొత్తం 4 ఎపిసోడ్లుగా ఉంది. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40 నిమిషాలకు పైగానే ఉంది.

నెట్‍ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

తెలుగులోనూ చూడొచ్చు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి