Operation Valentine OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..
పుల్వామా అటాక్ వంటి నిజమైన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో పూర్తిస్థాయిలో ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇదే కావడం విశేషం. వైమానిక దల వీరుల ధైర్య సాహసాలను.. దేశభక్తిని.. వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ మూవీలో చక్కగా చూపించారు డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ పైలట్ గా వరుణ్ తేజ్ కనిపించగా.. మానుషి రాడార్ ఆఫీసర్ గా కనిపించింది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. మార్చి 1న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో మానుషి చిల్లర్ కథానాయికగా నటించింది. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత సరికొత్త కథాంశంతో అడియన్స్ ముందుకు వచ్చిన వరుణ్ తేజ్..మరోసారి తన నటకు ప్రశంసలు అందుకున్నాడు. పుల్వామా అటాక్ వంటి నిజమైన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో పూర్తిస్థాయిలో ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇదే కావడం విశేషం. వైమానిక దల వీరుల ధైర్య సాహసాలను.. దేశభక్తిని.. వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ మూవీలో చక్కగా చూపించారు డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ పైలట్ గా వరుణ్ తేజ్ కనిపించగా.. మానుషి రాడార్ ఆఫీసర్ గా కనిపించింది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.
తాజా సమాచారం ప్రకారం ఆపరేషన్ వాలెంటైన్ సినిమా డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకే సొంతం చేసుకుందని తెలుస్తోంది. సినిమా విడుదలైన తర్వాత 30 రోజులకు ఓటీటీలో రిలీజ్ చేయాలని డీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం మార్చి 29 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఏప్రిల్ మొదటివారంలో గ్యారెంటీగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే హిందీ వెర్షన్ మాత్రం మరింత ఆలస్యం కానుందని టాక్.
ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ప్రస్తుతం వరుణ్ మట్కా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరీ, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.
Been seeing all your lovely reviews. I am grateful for all the wonderful responses. Experience #OperationValentine at your nearest cinemas now!🫡🇮🇳 pic.twitter.com/NtRJQJczJB
— Varun Tej Konidela (@IAmVarunTej) March 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.