Ooru Peru Bhairavakona OTT: ఓటీటీలో సందీప్ కిషన్ సినిమా సంచలనం.. ఇండియాలోనే నంబర్ వన్‌గా..ఎక్కడ చూడొచ్చంటే?
టీజర్స్, ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఊరు పేరు భైరవకోన ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లనే రాబట్టింది. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఊరు పేరు భైరవ కోన నెల తిరక్కుండానే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మహా శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీ అర్ధ రాత్రి నుంచే..
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా ఊరు పేరు భైరవకోన. వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ అడ్వెంచెరస్ ఫాంటసీ థ్రిల్లర్ లో కావ్య థాపర్ సెకెండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. టీజర్స్, ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఊరు పేరు భైరవకోన ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లనే రాబట్టింది. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఊరు పేరు భైరవ కోన నెల తిరక్కుండానే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మహా శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీ అర్ధ రాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఊరు పేరు భైరవ కోన డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై కూడా సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం తెలుగు ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ కు వచ్చినప్పటికీ నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉంటోంది. భారీగా వ్యూస్ వస్తుండటంతో కేవలం 24 గంటల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇండియా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్ కు చేరుకుంది ఊరు పేరు భైరవకోన. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది చిత్ర బృందం. అలాగే సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఊరు పేరు భైరవకోన సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు వెన్నెల కిశోర్, వైవా హర్ష, రవిశంకర్, వడివుక్కరసి కీరోల్స్ చేశారు. భాను భోగవరపు ఈ చిత్రానికి కథ అందించారు. శేఖర్ చంద్ర అందించిన స్వరాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ ఆలపించిన నిజమే నే చెబుతున్నా సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన సినిమాను థియేటర్ లో మిస్ అయ్యారా? మరెందుకు ఆలస్యం ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
అమెజాన్ ప్రైమ్ టాప్ ట్రెండింగ్ లో ఊరు పేరు భైరవ కోన
The magic has now reached every home in the country 💫
Magical Entertainer #OoruPeruBhairavakona is entertaining every household and Trending #1 in India on @PrimeVideoIN ❤️🔥
– https://t.co/sDCJn9vPA7@sundeepkishan’s much-anticipated, A @Dir_Vi_Anand Fantasy@VarshaBollamma… pic.twitter.com/KV2bzeVgxe
— AK Entertainments (@AKentsOfficial) March 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.