AHA OTT: ఆహా నుంచి మరో కొత్త సినిమా.. మంచి రోజులు వచ్చేది ఎప్పటి నుంచో తెలుసా.?
OTT: తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ఓటీటీ ఎక్స్‌పీరియన్స్‌ను పరిచయం చేస్తూ దూసుకొచ్చింది తొలి తెలుగు ఓటీటీ ఆహా. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఆహాకు మాత్రమే ప్రత్యేకమైన టాక్ షోలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది...
OTT: తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ఓటీటీ ఎక్స్‌పీరియన్స్‌ను పరిచయం చేస్తూ దూసుకొచ్చింది తొలి తెలుగు ఓటీటీ ఆహా. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఆహాకు మాత్రమే ప్రత్యేకమైన టాక్ షోలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఇక కొత్త కొత్త సినిమాలను సైతం విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తోంది ఆహా. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరి నెలలో డిజిటల్ ప్రేక్షకులకు అదిరిపోయే బహుమతి ఇచ్చేందుకు సిద్ధమైన ఆహా.. ఈ క్రమంలో తొలి అడుగు వేసింది. డిసెంబర్ 3 అంటే రేపు ఆహా వేదికగా ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా స్ట్రీమింగ్ మొదలు కానుంది. ఈ చిత్రం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా విడుదల కానుంది.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న ఆహా టీమ్ రిలీజ్ పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ.. ‘డప్పు కొట్టి మరీ చెబుతున్నాం.. మంచి రోజులు వచ్చేస్తున్నాయి. సిద్ధంగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సంపాదించుకుంది. మారుతి మార్క్ కామెడీ.. ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఏక్ మిని కథాతో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాడు. ఇక గతకొన్ని రోజులుగా సరైన విజయం లేక సతమతమవుతోన్న హీరోయిన్ మెహరీన్‌కు కూడా ‘మంచి రోజులు వచ్చాయి’ నిజంగానే మంచి రోజులు తెచ్చాయని చెప్పాలి. మరి థియేటర్లలో మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
?డప్పు కొట్టి మరీ చెప్తున్నాం మంచి రోజులు వచ్చేస్తున్నాయి? 1 day to go #MRVOnAHA సిద్దంగా ఉండండి #ManchiRojulochaie@santoshshobhan @Mehreenpirzada @DirectorMaruthi @SKNonline @harshachemudu @vennelakishore @Satyamrajesh2 @IamSaptagiri @UV_Creations @anuprubens pic.twitter.com/IoThYsaDj1
— ahavideoIN (@ahavideoIN) December 2, 2021
Also Read: Bangarraju: బంగార్రాజు మూవీ నుంచి త్వరలో అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న సాంగ్ టీజర్..