AHA Unstoppable: హాస్య బ్రహ్మతో నట సింహం.. నవ్వి నవ్వి కడుపు చెక్కలయ్యేలాగే ఉందే.! అన్‌స్టాపబుల్‌ కొత్త ప్రోమో..

AHA Unstoppable:: తనలోని మరో ట్యాలెంట్‌ను బయటపెడుతూ నట సింహం బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే' అనే షోలో వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న...

AHA Unstoppable: హాస్య బ్రహ్మతో నట సింహం.. నవ్వి నవ్వి కడుపు చెక్కలయ్యేలాగే ఉందే.! అన్‌స్టాపబుల్‌ కొత్త ప్రోమో..
Unstable With Nbk
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 02, 2021 | 11:30 AM

AHA Unstoppable: తనలోని మరో ట్యాలెంట్‌ను బయటపెడుతూ నట సింహం బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే’ అనే షోలో వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న ఈ ప్రత్యేక టాక్‌షోకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో ఈ షో సంచలనం సృష్టించినట్లు ఇటీవల ‘ఆహా’ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ షోలో పాల్గొన్న మోహన్‌ బాబు, నానిలతో జరిగిన ఎపిసోడ్స్‌ డిజిటల్‌ ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. ఇదిలా ఉంటే గాయం కారణంగా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న బాలకృష్ణ ఇప్పుడు మూడో ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ షోకి హాజరయ్యారు.

డిసెంబర్‌ 3 రాత్రి 8 గంటల నుంచి టెలికాస్ట్‌ కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్‌ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌గా మారింది. ప్రోమోను గమనిస్తే ఎపిసోడ్‌ పూర్తిగా కామెడీగా సాగినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ, బ్రహ్మానందంల మధ్య జరిగిన సంభాషణలు నవ్వులు తెప్పిస్తున్నాయి. బ్రహ్మానందం ఫోటోలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న మీమ్స్‌కు సంబంధించి ఈ టాక్‌ షోలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక ఈ షోలో బ్రహ్మానందంతో పాటు దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా హాజరయ్యారు.

ఇక ప్రోమో చివర్లో బాలయ్య, అనిల్‌తో మాట్లాడుతూ.. ‘బ్రహ్మానందం గారిని మన సినిమాలో కూడా’ అని అపేశారు. దీంతో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా చేస్తున్నారని చెప్పకనే చెప్పేశారు. మరి ప్రోమోలోనే ఈ రేంజ్‌లో హాస్యం ఉంటే.. ఇక పూర్తి ఎపిసోడ్‌ చూస్తే ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా కనిపిస్తోంది. మరి ఈ ఫన్నీ ప్రోమోపై మీరూ ఓసారి చూసేయండి..

▶️ https://t.co/NtcWQIwDeS#UnstoppableWithNBK Episode 3 Premieres Dec 3rd#NandamuriBalakrishna #Brahmanandam @AnilRavipudi #MansionHouse @tnldoublehorse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustriesltd pic.twitter.com/IMYrZPmnAV

— ahavideoIN (@ahavideoIN) December 1, 2021

Also Read: Omicron: కేంద్రం కఠిన చర్యలు.. నెగెటివ్ వచ్చినా 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి.. పాజిటివ్ అయితే గత 14 రోజుల హిస్టరీ ఇవ్వాల్సిందే..

Walnuts: వాల్‌ నట్స్‌ని ఇలా తిన్నారంటే.. అస్సలు వదలరు..! ఆరోగ్యానికి కూడా ఇన్ని ప్రయోజనాల..?

BJP ChiefJP Nadda: భారతదేశం-రష్యాల మధ్య వీడదీయలేని సంబంధాలు.. ఇక ముందు కలిసి సాగాలిః జేపీ నడ్డా