Omicron: కేంద్రం కఠిన చర్యలు.. నెగెటివ్ వచ్చినా 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి.. పాజిటివ్ అయితే గత 14 రోజుల హిస్టరీ ఇవ్వాల్సిందే..

Omicron India: కరోనా వైరస్ సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఆఫ్రికా ఖండాన్ని దాటేసి.. ఆసియా, యురేపియన్, అమెరికా, ఖండాల్లో అడుగు పెట్టింది. ప్రపంచ దేశాలను భయపెడుతూ..

Omicron: కేంద్రం కఠిన చర్యలు.. నెగెటివ్ వచ్చినా 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి.. పాజిటివ్ అయితే గత 14 రోజుల హిస్టరీ ఇవ్వాల్సిందే..
Omicron India
Follow us
Surya Kala

|

Updated on: Dec 02, 2021 | 9:58 AM

Omicron India: కరోనా వైరస్ సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఆఫ్రికా ఖండాన్ని దాటేసి.. ఆసియా, యురేపియన్, అమెరికా, ఖండాల్లో అడుగు పెట్టింది. ప్రపంచ దేశాలను భయపెడుతూ 20 పైగా దేశాల్లో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకూ భారత్ లో అధికారికంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు.. అయినపప్పటికీ ఈ మహమ్మారి ఎంట్రీ ఇచ్చింది అనే అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

భారత్‌లో ఒమిక్రాన్ పై ముందస్తు చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్  ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకుంటోంది. విమానాశ్రయాలు దగ్గర కరోనా టెస్టులను పెంచింది. ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చి, కరోనా వైరస్ బారిన పడ్డ వారు చాలామంది ఉన్నారు. బాధితుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు. రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

యునైటెడ్ కింగ్‌డమ్, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్సువానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్‌, దక్షిణాఫ్రికా ఈ 12 దేశాలను ఎట్ రిస్క్‌గా గుర్తించింది.  ఈ దేశాల నుంచి ఎవరు వచ్చినా.. కరోనా ప్రొటోకాల్స్‌ను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. ఈ దేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలను విధించింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన స్వదేశీయులకు, విదేశీయులకూ ఈ నిబంధనలను వర్తింపజేసింది. ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను విమానాశ్రయంలో అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సువిధ యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల కోసం.. ఎయిర్ పోర్ట్స్ వద్ద వైరస్ నిర్ధారణ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అంతేకాదు కోవిడ్ నెగెటివ్ వచ్చినా విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరును తప్పని సరిగా 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఉండాలని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా కరోనా నిర్ధారణ అయితే వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపిస్తారు. అనంతరం బాధితులు క్వారంటైన్ కు వెళ్లాల్సి ఉంటుంది. వీరి  14 రోజుల ట్రావెల్ హిస్టరీని తప్పనిసరిగా విమానాశ్రయం అధికారులకు అందజేయాలి. కరోనా పాజిటివ్ వచ్చిన వారు గత 14 రోజుల్లో ఏ దేశంలో పర్యటించారనే విషయాన్ని  చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు వారి కాంటాక్టులను గుర్తించేలా చర్యలు తీసుకుంటారు.

Also Read:  వంట ఇంట్లో ఈజీగా వంట చేయాలంటే.. ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..