Viral Video: గర్జిస్తున్న పులులు.. వైరల్గా మారిన వీడియో..
ఇండియాలో పులులు సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. చాలా చోట్ల అడవుల్లో పులులు కనిపిస్తున్నాయి. ఓ చోట పులి తన పిల్లలతో కలిసి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది...
ఇండియాలో పులులు సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. చాలా చోట్ల అడవుల్లో పులులు కనిపిస్తున్నాయి. ఓ చోట పులి తన పిల్లలతో కలిసి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో తల్లి పులి పిల్ల పులులకు కొంత దూరంలో ఉండి కనిపించింది. ఈ వీడియోను ఐఏఎస్ సుప్రియ సాహు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
” ఒక తల్లి తన ముగ్గురు పిల్లలకు బోధిస్తున్నట్లుగా ఉంది. క్రమశిక్షణ, ఆమె వారిని తనిఖీ చేసే విధానాన్ని చూడండి” అని సుప్రియ సాహు రాసుకొచ్చారు. ఈ వీడియో ఎక్కడ తీశారో.. ఎప్పుడు తీశారో తెలియరాలేదు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని రెండు, మూడేళ్ల కింది వీడియో అని తెలుస్తుంది. ఇండియాలో ప్రస్తుతం 2,967 పులులు ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరాఖండ్లో 215 పులులు ఉన్నాయి. ఆ మధ్యప్రదేశ్లో 176 ఉన్నాయి.
Tiger Country – looks like a mother teaching her three teenage kids ? look at the discipline and the way she checks on them
Seen near Geddai Dam #Nilgiris #Tiger #wildlife vc-shared by a friend pic.twitter.com/se5mIwaP4i
— Supriya Sahu IAS (@supriyasahuias) December 1, 2021
Read Also.. Omicron: భయపెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్.. బూస్టర్ డోస్ ఎవరికి అవసరం.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..