AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: వంట ఇంట్లో ఈజీగా వంట చేయాలంటే.. ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..

Kitchen Hacks: ప్రస్తుత కాలంలో మనిషిజీవితం ఉరుకులు పరుగులు. ఆడామగా అనే తేడా లేకుండా ఉద్యోగం, విధులను నిర్వహించాల్సిన పరిస్థితులు. దీంతో ఉన్న సమయాన్ని..

Kitchen Hacks: వంట ఇంట్లో ఈజీగా వంట చేయాలంటే.. ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..
Kitchen Tips
Surya Kala
|

Updated on: Dec 02, 2021 | 9:10 AM

Share

Kitchen Hacks: ప్రస్తుత కాలంలో మనిషిజీవితం ఉరుకులు పరుగులు. ఆడామగా అనే తేడా లేకుండా ఉద్యోగం, విధులను నిర్వహించాల్సిన పరిస్థితులు. దీంతో ఉన్న సమయాన్ని అదా చేసుకుంటూ పనులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా మహిళలు ఓ వైపు ఇల్లాలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు ఉద్యోగం చేస్తుంటే మాత్రం మరింతగా రోజుని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు వంట ఇంట్లోనే ఉండే ఆహారపదార్ధాల విషయంలోనే కాదు .. వంట చేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎలాంటి టెన్షన్ ఉండదు..

*ఉప్పు నీరుగా మారకుండా ఉండాలంటే ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేస్తే.. చాలు. ఉప్పు చెమ్మచేరి నీరు కారిపోకుండా ఉంటుంది. *వేపుడు చేస్తున్న సమయంలో నూనె పీల్చకూడదు అంటే.. నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే సరి. *పచ్చిమిరపకాయల్ని కాసింత పసుపుతో చేర్చి సీసాలో నిలువ చేస్తే ఎరుపు రంగుకు మారకుండా ఉంటాయి. *కూరకు పులుపు తక్కువ అయినా, టమాటా రుచి కావాలన్నా.. మార్కెట్లో దొరికే మామిడి పొడికి కొంచెం పెరుగు కలపండి. టొమాటో రుచి వస్తుంది. *పెరుగు పుల్లగా మారకుండా ఉండటానికి పెరుగులో కొబ్బరిముక్కను లేదా ఎండు మిర్చి వేసి చూడండి *మిక్సీ బ్లేడు పదునుగా ఉండాలంటే మిక్సీ జార్లలో కొద్దిగా ఉప్పు వేసి తిప్పాలి. * దోసెలు పెనానికి అతుక్కుపోకుండా ఈజీగా రావాలంటే.. పెనంపై ముందుగా వంకాయ ముక్కతో రుద్దండి *పనీర్‌ ఎక్కువ కాలం తాజాగా ఉండా లంటే.. పనీర్ ని బ్లాటింగ్‌ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. *వెల్లుల్లి రేకులను సులువుగా తీయాలంటే వాటికి నూనె రాసి ఎండలో కొద్ది సేపు ఉంచండి. *గ్రుడ్డుసొనకి ఒక టీస్పూన్ మైదాపిండి కలిపితే ఆమ్లెట్ పెద్దగా పొంగినట్లుగా వచ్చి చాలా సేపు అలాగే ఉంటుంది *ఉడికిన కోడిగ్రుడ్లపై పెంకు సులభంగా రావాలంటే.. ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే గ్రుడ్లను చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది *కోడిగుడ్లు పెంకును జాగ్రత్తా పరిశీలించండి. మంచి షైనింగ్‌ ఉంటే కోడి గుడ్లు తాజావి. పెంకు కాస్తా రంగు మారిందంటే నిల్వ కోడిగుడ్లని అర్ధం చేసుకోవాలి. *కోడిగ్రుడ్లు ఉడక పెట్టడానికి ఒకటి, రెండు గంటలు ముందుగానే ఫ్రిజ్ లోంచి తీసి ఉంచితే పగిలే అవకాశం ఉండదు *దోశలపిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బితే, దోసెలు పల్చగా వస్తాయి *కేక్ చేసేటప్పుడు పిండిలో ఒక చెంచా గ్లిసరిన్ కలిపితే కేకు ఎక్కువకాలం తాజాగా ఉంటుంది

Also Read:  అనంతపురం జిల్లాను వీడని వరద కష్టాలు.. ప్రాణాలకు తెగించి నది దాటి మృతదేహనికి అంత్యక్రియలు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్