Bangarraju: బంగార్రాజు మూవీ నుంచి త్వరలో అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న సాంగ్ టీజర్..

Bangarraju: బంగార్రాజు మూవీ నుంచి త్వరలో అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న సాంగ్ టీజర్..
Bangarraju

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు.. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్ గా ఈసినిమా తెరకెక్కుతుంది.

Rajeev Rayala

|

Dec 02, 2021 | 11:13 AM

Bangarraju: అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు.. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగచైతన్య కు జోడీగా లెట్స్ సెన్సేషన్ కృతిశెట్టి నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈసినిమా పోస్టర్లు, టీజర్స్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇక బంగార్రాజు సినిమాలో నాగలక్ష్మి అనే పాత్రలో కనిపించనుంది కృతి శెట్టి. నాగలక్ష్మి లుక్ ను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈక్రమంలో తాజాగా ఓ అందమైన పాటను త్వరలో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు.

నాగచైతన్య – కృతిశెట్టి మధ్య వచ్చే ఈ అందమైన పాట ఆకట్టుకుంటుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. నా కోసం నువ్వు ..అంటూ సాగే ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించగా.. సిద్ శ్రీరామ్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో చలపతి రావు.. రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun: వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన అల్లు అర్జున్‌.. రూ.25 లక్షలు విరాళంగా అందించిన ఐకాన్‌ స్టార్‌..

Nikita Dutta: తలపై కొట్టి ఫోన్‌ లాక్కెళ్లారు.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్న బాలీవుడ్‌ నటి..

Naga Shaurya: ఆమెను చూస్తే ఎవ్వరికైనా రొమాన్స్ చేయాలనిపిస్తుంది.. నాగ శౌర్య ఆసక్తికర కామెంట్స్

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu