Naga Shaurya: ఆమెను చూస్తే ఎవ్వరికైనా రొమాన్స్ చేయాలనిపిస్తుంది.. నాగ శౌర్య ఆసక్తికర కామెంట్స్

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న సినిమా ‘లక్ష్య’.  ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు.

Naga Shaurya: ఆమెను చూస్తే ఎవ్వరికైనా రొమాన్స్ చేయాలనిపిస్తుంది.. నాగ శౌర్య ఆసక్తికర కామెంట్స్
Naga Shourya

Naga Shaurya: స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న సినిమా ‘లక్ష్య’.  ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్  బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్ష్య చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విక్ట‌రి వెంక‌టేష్ విడుద‌ల‌చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.  ఇక ఈ సినిమా గురించి హీరోయిన్ కేతిక శర్మ మాట్లాడుతూ.. ‘ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సంతోష్ గారికి థ్యాంక్స్ అన్నారు. కొన్ని సీన్లు చూశాను. నాగ శౌర్య అద్భుతంగా నటించారు. నాలుగు విభిన్న పాత్రల్లో ఆయన కనిపిస్తారు. సంతోష్ గారు తన మనసులోంచి ఈ కథను అందంగా రాశారు. జగపతి బాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వంగా ఉంది’ అని అన్నారు.

అలాగే హీరో నాగ శౌర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం రెండున్నరేళ్లుగా కష్టపడ్డాం అన్నారు. మొదటగా సంతోష్ వచ్చి మూడు గంటలు కథ వినిపించారు. అప్పటికి ఇంటర్వెల్ అయింది. ఇక మిగతా కథ రేపు వింటాను అని అన్నాను. ఆయన ప్రతీ ఒక్క పాయింట్‌ను ఎంతో క్లియర్‌గా వివరించారు. బాణం ఎలా పట్టుకోవాలి.. ఎలా వదలాలి అని చెప్పారు. అప్పుడే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను అన్నారు. సెండాఫ్ విని ఓకే చేసేద్దామని అనుకున్నాను. మా నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చేద్దాం సర్ అంటూ చిన్నపిల్లాడిలా అడిగేవాడిని అన్నారు. కాళ భైరవ నా స్నేహితుడు. ఐదారేళ్ల నుంచి పని చేయాలని అనుకున్నాం. ఇప్పుడు ఇలా కుదిరింది. ఆర్ఆర్ మాత్రం అదరగొట్టేశాడు అన్నారు శౌర్య.

కేతిక శర్మ రొమాంటిక్ సినిమాలో నటించింది. ఆ అమ్మాయిని చూస్తే ఎవ్వరికైనా సరే రొమాన్స్ చేయాలనిపిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే ఇంత అభిమానాన్ని చాలా తక్కువ మంది సంపాదించుకుంటారు.  సినిమాటోగ్రఫర్ రామ్ రెడ్డి గారు చాలా బాగా చూపించారు. మాటల రచయిత మణి గారు చాలా బాగా రాశారు. ఈ చిత్రంలో జగపతి బాబు గారు, సచిన్ ఖేద్కర్ గారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. నేను మోయలేని సమయంలో ఆ ఇద్దరూ వచ్చి నిలబెడతారు. ముగ్గురి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. కథను చెప్పి స్పూర్తినింపిన డైరెక్టర్ సంతోష్ గారు ఒకరు. జగపతి బాబు గారిని డామినేట్ చేయాలనే కోరిక ఉండటం, సచిన్ ఖేద్కర్ వంటి వారి వంటి నటులు నా ముందు ఉండటంతో నాలోని నటుడిని బయటకు తీసుకురావాలనే కోరిక పుట్టింది. స్పోర్ట్స్ సినిమా అంటే చివరకు హీరో గెలవాలి. ప్రేమ కథలు అంటే అమ్మాయి అబ్బాయి చివరకు కలవాలి. ప్రతీ సినిమాలోనూ అలానే ఉంటుంది. ఈ చిత్రంలో కూడా అలానే ఉంటుంది. కానీ చివరకు హీరో ఎలా గెలిచాడన్నది ఆసక్తి కరంగా ఉంటుంది. ఒకేసారి సినిమా సినిమాకు లుక్ మార్చడం చాలా కష్టంగా అనిపించింది. కోహ్లీ కి కూడా సిక్స్ ప్యాక్ ఉంటుంది. క్రికెట్‌కు సిక్స్ ప్యాక్ అవసరం లేదు. మన మైండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందని చెప్పడానికి ఫిట్ నెస్ ఉపయోగపడుతుంది. ఈ కథ నన్ను 8 ప్యాక్స్ కోరింది. నేను చేశాను. ఒక వేళ కారెక్టర్ డిమాండ్ చేస్తే పది పలకల దేహాన్ని కూడా చేస్తాను’ అని నాగ శౌర్య అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ramcharan: ఆచార్యలో చరణ్‌ పాత్రపై క్లారిటీ!.. సినిమాలో ఎంతసేపు కనిపించనున్నాడంటే..

Shilpa Chowdary: ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కిలాడి లేడి శిల్పా చౌదరి లీలలు.. తాజా లిస్టులో ప్రముఖ సినీ ఫ్యామిలీ!

Shyam Singha Roy: మీసం మెలేసిన నాని.. ఆకట్టుకుంటున్న శ్యామ్ సింగరాయ్ ప్రోమో..

Click on your DTH Provider to Add TV9 Telugu