Ramcharan: ఆచార్యలో చరణ్‌ పాత్రపై క్లారిటీ!.. సినిమాలో ఎంతసేపు కనిపించనున్నాడంటే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసందే

Ramcharan: ఆచార్యలో చరణ్‌ పాత్రపై క్లారిటీ!.. సినిమాలో ఎంతసేపు కనిపించనున్నాడంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 02, 2021 | 9:46 AM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ‘సిద్ధ’ అనే పాత్రలో చరణ్‌ సందడి చేయనున్నాడు. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకులను ఒకే ఫ్రేమ్‌లో చూసేందుకు సినీ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. కాగా ‘ఆచార్య’ సినిమాలో చరణ్‌ ఎంతసేపు ఉంటాడనేది ఆసక్తికరంగా మారింది. సోషల్‌ మీడియాలోనూ దీనికి సంబంధించి పలు రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం సినిమాలో మెగా పవర్‌స్టార్‌ పాత్ర నిడివి 45 నిమిషాలకు పైగానే ఉంటుందట. ఫస్టాఫ్‌ చివర్లో చరణ్‌ ఎంట్రీ ఇస్తాడని, సెకండాఫ్‌లో దాదాపు 40 నిమిషాల వరకు అతని పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

కాగా చరణ్‌ పాత్రకు సంబంధించి కొరటాల శివ గతంలోనూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలో చిరు- చరణ్‌ల కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్‌కు కనులపండగలా ఉంటాయన్నారు. కాగా ఇటీవల విడుదలైన టీజర్‌ చివరిలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు తండ్రీ తనయులు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌తో కలిపి మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకన్న ఈ సినిమా 2022, ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read:

Shilpa Chowdary: ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కిలాడి లేడి శిల్పా చౌదరి లీలలు.. తాజా లిస్టులో ప్రముఖ సినీ ఫ్యామిలీ!

Shyam Singha Roy: మీసం మెలేసిన నాని.. ఆకట్టుకుంటున్న శ్యామ్ సింగరాయ్ ప్రోమో..

RGV: నేను హైదరాబాద్‌లో ఉన్నా.. మీరు స్వర్గంలో ఉన్నారు అంతే తేడా.. సిరివెన్నెల మృతిపై రామ్‌ గోపాల్‌ వర్మ..