RGV: నేను హైదరాబాద్‌లో ఉన్నా.. మీరు స్వర్గంలో ఉన్నారు అంతే తేడా.. సిరివెన్నెల మృతిపై రామ్‌ గోపాల్‌ వర్మ..

Ramgopal Varma: ప్రపంచాన్ని అందరూ ఒకలా చూస్తే తాను మాత్రం మరోలా చూస్తారా. అందుకే ఆయన రామ్‌గోపాల్ వర్మ అయ్యారు. అసలు ఈ సృష్టిలో బాధ అనేదే ఉండదని చెప్పే వర్మ.. చివరికి చావును కూడా...

RGV: నేను హైదరాబాద్‌లో ఉన్నా.. మీరు స్వర్గంలో ఉన్నారు అంతే తేడా.. సిరివెన్నెల మృతిపై రామ్‌ గోపాల్‌ వర్మ..
Rgv
Follow us

|

Updated on: Dec 02, 2021 | 8:18 AM

Ramgopal Varma: ప్రపంచాన్ని అందరూ ఒకలా చూస్తే తాను మాత్రం మరోలా చూస్తారా. అందుకే ఆయన రామ్‌గోపాల్ వర్మ అయ్యారు. అసలు ఈ సృష్టిలో బాధ అనేదే ఉండదని చెప్పే వర్మ.. చివరికి చావును కూడా సెలబ్రేట్‌ చేసుకోవాలని చెబుతుంటారు. ఇలాంటి ఎన్నో అంశాలను రామూయిజం రూపంలో ప్రేక్షకులతో పంచుకున్నారు వర్మ. ఇదిలా ఉంటే తాజాగా సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణంపై కూడా తనదైన శైలిలో స్పందించారు వర్మ. సిరివెన్నెలతో ఎన్నో సినిమాలకు పనిచేసిన వర్మ.. తాను లేని లోటును తలుచుకొని విభిన్నంగా స్పందించారు. ప్యాడ్‌కాస్ట్ రూపంలో రెండు ఆడియో క్లిప్స్‌ను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు వర్మ.

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ‘మీరు లక్కీగా స్వర్గానికి వెళ్లిపోయారు. అక్కడ వాట్సాప్‌ లాంటివి ఉంటే.. నాకు మీ ఫీలింగ్‌, అమృతం ఎలా ఉంది.? రంభ, ఊర్వశి, మేనక ఎలా ఉన్నారు నాకు చెబితే చాలా సంతోషిస్తాను. నేను హైదరాబాద్‌లో ఉన్నాను, మీరు స్వర్గంలో ఉన్నారు అంతకంటే పెద్ద తేడా ఏమీ లేదు. తెలివి ఉన్నవాడు ఎవ్వడైనా సరే మీరు మంచి ప్లేస్‌కు వెళ్లినందుకు సంతోషపడతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌ మిస్ అవుతారు అనేది నాకు సంబంధం లేదు.. నేను ఒక ప్రేక్షకుడిగా నా స్వార్థంతో నేను చెప్తున్నాను.. మీరు అక్కడికి వెళ్లడం నాకు హ్యాపీగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: HDFC Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఎంత పెరిగాయంటే..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో మళ్లీ అదే రచ్చ.. వాగ్వాదానికి దిగిన సన్నీ, సిరి.. మధ్యలో షణ్ముఖ్

whatsapp: వాట్సాప్ ద్వారా స్టాక్ మార్కెట్‎లో‎ పెట్టుబడి పెట్టొచ్చు.. ఎలాగంటే..