AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో మళ్లీ అదే రచ్చ.. వాగ్వాదానికి దిగిన సన్నీ, సిరి.. మధ్యలో షణ్ముఖ్

బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుందో.. అర్ధమే కావడంలేదు. రోజు రోజుకు గొడవలు, ఏడుపులు, అరుపులు, అలగడాలు ఎక్కువవుతున్నాయి.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో మళ్లీ అదే రచ్చ.. వాగ్వాదానికి దిగిన సన్నీ, సిరి.. మధ్యలో షణ్ముఖ్
Rajeev Rayala
|

Updated on: Dec 02, 2021 | 9:56 AM

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుందో.. అర్ధమే కావడంలేదు. రోజు రోజుకు గొడవలు, ఏడుపులు, అరుపులు, అలగడాలు ఎక్కువవుతున్నాయి. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో డ్రామా కాస్త ఎక్కువైందని చూసే ప్రేక్షకులు అంటున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో రచ్చ రచ్చ చేశారు హౌస్ మేట్స్. ఐస్ టబ్స్ లో నుంచి కాళ్లు బయటపెట్టకుండా తమ దగ్గర ఉన్న బాల్స్‌ని కాపాడుకోవాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ హౌస్ మేట్స్ మధ్య మరింత అగ్గి రాజేసింది. సన్నీ అలా కాలు కిందికి పెట్టాడో లేడో.. సిరి వచ్చి బాల్‌లు కొట్టేసింది .. నా కాలు టబ్‌లోనే ఉందని సన్నీ చెప్తుంటే.. లేదు సన్నీ అని ఆట మొదలుపెట్టింది సిరి. ఆ టైంలో సన్నీ బాల్స్ అన్నీ కిందపడేసింది సిరి. దీంతో సన్నీకి పట్టరాని కోపం వచ్చింది.

దాంతో నేను గేమ్ ఇప్పుడు ఆడతా అంటూ మొదలు పెట్టాడు. సిరి కాలు కింద పెట్టగానే ఆమె బాల్స్ ను కొట్టేశాడు. దాంతో అరిచిరాధాంతం చేసింది సిరి. ఓవైపు ఏడుస్తూనే.. సన్నీ బాల్స్ కొట్టేసే ప్రయత్నం చేసింది. దాంతో సన్నీ కూడా సిరి పక్కనే నిలుచొని సిరి కాలు బయటపెడితే బాల్స్ తీసేయడానికి సన్నీ ప్రయాతనించాడు. సిరి అందుకొని నేను గివ్ అప్ ఇవ్వను గేమ్ ఆడతాను అంటూ పెద్దగా అరుస్తూ.. ఏడ్వడం మొదలుపెడితే.. వెంటనే షణ్ముఖ్ కూడా స్టార్ట్ చేశాడు. సిరీ.. రవీ ఐ యామ్ ప్లేయింగ్ ఫర్ యు అంటూ అరవడం మొదలు పెట్టాడు. మధ్యలో శ్రీరామ్ వచ్చి.. సన్నీ నీకు బాల్స్ కావాలంటే నా దగ్గర తీసుకో అని సలహా ఇచ్చాడు.. దానికి సన్నీ నేను నా గేమ్ ఆడుతున్నా అంటూ చెప్పుకొచ్చాడు. సిరి మళ్లీ సన్నీ బాల్స్ కొట్టేసింది. సన్నీ వెళ్లి ఆమె బాల్స్‌ని కిందపడేసి.. కాళ్లు టబ్‌లో లేవు అని అన్నాడు.. మళ్లీ సేమ్ గొడవ కాళ్లు ఉన్నాయని సిరి.. లేవని సన్నీ.. వాదించుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: షాకింగ్ ట్విస్ట్.. టాప్ 5లోకి ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఎవరెవరంటే..

Pushpa: పుష్ప నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బన్నీ ఫ్యాన్స్‏కు పండగే..

Comedian Raghu: సినిమా టు లిక్కర్‌ బిజినెస్‌.. మద్యం షాపులను దక్కించుకున్న కమెడియన్‌ రఘు..

దావోస్‌లో ఏపీకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. లక్ష ఉద్యోగాలు
దావోస్‌లో ఏపీకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. లక్ష ఉద్యోగాలు
'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!