Bigg Boss 5 Telugu: షాకింగ్ ట్విస్ట్.. టాప్ 5లోకి ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఎవరెవరంటే..

Bigg Boss 5 Telugu: షాకింగ్ ట్విస్ట్.. టాప్ 5లోకి ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఎవరెవరంటే..
Bigg Boss

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. 19 మంది కంటెస్టెంట్స్‏తో ప్రారంభమైన ఈ రియాల్టీ షో ప్రస్తుతం 7గురు మిగిలారు.

Rajitha Chanti

|

Dec 01, 2021 | 9:32 PM

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. 19 మంది కంటెస్టెంట్స్‏తో ప్రారంభమైన ఈ రియాల్టీ షో ప్రస్తుతం 7గురు మిగిలారు. 12 వారాలు పూర్తిచేసుకుంది. ఇక 13వ వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు శ్రీరామ్, మానస్, ప్రియాంక, కాజల్, సిరి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక 12వ వారం ఎవరు ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యారు. దీంతో రవి ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ అతని అభిమానులు రచ్చ చేశారు. ఇక ఈ వారం మరోకరు ఇంటి నుంచి బయటకు రాబోతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ వారం నామినేట్ అయిన సభ్యులతో అతి తక్కువ ఓట్లు ప్రియాంక సింగ్‏కు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎక్కువగా శ్రీరామ్ చంద్రకు ఓట్స్ రాగా.. ఆ తర్వాతి స్థానంలో మానస్.. అతని తర్వాత కాజల్ కు అత్యధిక ఓట్లు వచ్చాయి. ఇక సిరి, ప్రియాంక డేంజర్ జోన్‏లో ఉండగా.. సిరి కంటే ప్రియాంకు అత్యల్ప ఓట్లు వచ్చినట్లుగా సోషల్ మీడియాలో టాక్. అయితే బిగ్‏బాస్ షో చివరి దశకు రావడంతో టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారనే విషయంపై నెట్టింట్లో చర్చ జరుగుతుంది.

ప్రస్తుతం ఉన్న 7గురిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు.. ఎవరు టాప్ 5లో ఉండనున్నారు అనే చర్చిస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే.. ఈసారి ప్రియాంక్ ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి ప్రియాంక గతవారమే ఎలిమినేట్ కావాల్సింది.. కానీ అనుహ్యంగా రవికి తక్కువ ఓట్లు వచ్చాయంటూ రవిని ఎలిమినేట్ చేశారని వాదన.

ఇక ప్రస్తుతం ఉన్న 7గురులో సన్నీ, షణ్ముఖ్ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. వీరిద్దరూ టాప్ 1, 2 స్థానాల్లో ఉండడం ఖాయం. ఇప్పటివరకు షణ్ముఖ్ కంటే సన్నీ ఓట్స్ పరంగా టాప్ 1 స్థానంలో ఉన్నాడు. ఇక ఇదే కంటిన్యూ అయితే సన్నీ బిగ్‏బాస్ విజేత అవడం పక్కా అంటున్నారు. ఇక షణ్ముఖ్.. ముందు నుంచి గేమ్స్, టాస్కులకు దూరంగా ఉంటూ.. కేవలం సిరితో మాత్రమే ఉంటున్నాడని.. గేమ్ పై సరిగ్గా ఫోకస్ చేయడం లేదని మొదటి నుంచి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చివరి దశలోనైనా సిరిని పక్కన పెట్టి గేమ్ పై ఫోకస్ చేస్తే షణ్ముఖ్ టైటిల్ సొంతంగా ఖాయం. ఇక ఆ తర్వాత స్థానంలో సింగర్ శ్రీరామ్ ఉండనున్నాడు. అలాగే గత రెండు మూడు వారాల నుంచి కాజల్ ఆట తీరులో చాలా మార్పు వచ్చింది. గతంలో సన్నీ కోసం కాజల్ స్టాండ్ తీసుకుని మాట్లాడిన సమయం నుంచి కాజల్ ఓటింగ్ రేట్ పెరిగిపోయింది. ఇక గత కొద్ది రోజులుగా సన్నీ, మానస్, ప్రియాంకతో ఉండడం వలన కాజల్‏ ఓటింగ్ పై ప్రభావం చూపిస్తుంది. ఇక కంటిన్యూ అయితే 4వ స్థానంలో కాజల్ ఉండనుంది.

ఇక మిగిలింది మానస్, ప్రియాంక, సిరి.. వీరిలో ముందు నుంచి మానస్ ఓటింగ్ శాతం ఎక్కువే ఉంది. మానస్, సిరి.. ఇద్దరికి తక్కువ తేడాతో ఓటింగ్ శాతంలో దూసుకుపోతున్నారు. అయితే సిరి.. షణ్ముఖ్‏‏తో శ్రుతిమించిన ప్రవర్తన.. హగ్గులు..ముద్దులు అంటూ కావాల్సినంత నెగివిటిని సంపాదించుకుంటుంది. తాము ఫ్రెండ్స్ అంటూనే.. కనెక్ట్ అయ్యాను అంటూ నాగార్జున ముందు చెప్పడం.. ఫ్యామిలీ ఎపిసోడ్‏లో సిరి తల్లి వచ్చి వద్దని.. షణ్ముఖ్‏ను హగ్ చేసుకోవడం తనకు నచ్చడం లేదంటూ కుండబద్దలు కొట్టింది. దీంతో హర్ట్ అయిన సిరి.. తన తల్లి మాటలను వ్యతిరేకించింది. తండ్రిగా.. అన్నగా.. స్నేహితుడిగా మాత్రమే చూడాలని తన తల్లి చెప్పిన మాటలను సిరి ఒప్పుకోకపోగా.. ఆమెపై సీరియస్ కావడం సిరికి పూర్తిగా నెగిటివిటి వచ్చింది. క్రమంగా ఆమె ఓటింగ్ శాతం కూడా తగ్గిపోయింది. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో మళ్లీ షణ్ముఖ్‍ను హగ్ చేసుకోవడంతో సిరి ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గినట్లే. దీంతో సిరితోపాటు ఓటింగ్ శాతంలో వెనకబడిన మానస్ చివరి ఐదవ స్థానంలో ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సిరి.. షణ్ముఖ్‏కు దూరంగా ఉంటూ.. తన గేమ్ పై ఫోకస్ పెడితే మాత్రం టాప్ 5లో సిరి ఉండడం ఖాయం. ఇక ప్రియాంకను టాప్ 5లో ఉంచిన ఆశ్చర్యపోనవసరం లేదు..

Also Read: Pushpa: పుష్ప నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బన్నీ ఫ్యాన్స్‏కు పండగే..

Anchor Ravi: నా ఫ్యామిలీ జోలికి వచ్చారు.. డబ్బులిస్తే వాళ్లింట్లో వాళ్లను కూడా ట్రోల్ చేస్తారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu