Anchor Ravi: నా ఫ్యామిలీ జోలికి వచ్చారు.. డబ్బులిస్తే వాళ్లింట్లో వాళ్లను కూడా ట్రోల్ చేస్తారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్..

బిగ్‏బాస్ రియాల్టీ షో.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. ముందు నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయంలో

Anchor Ravi: నా ఫ్యామిలీ జోలికి వచ్చారు.. డబ్బులిస్తే వాళ్లింట్లో వాళ్లను కూడా ట్రోల్ చేస్తారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్..
Anchor Ravi
Follow us

|

Updated on: Dec 01, 2021 | 7:46 PM

బిగ్‏బాస్ రియాల్టీ షో.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. ముందు నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయంలో ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతుంటారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్నవారు ఎవరు ఊహించని విధంగా ఇంటి నుంచి బయటకు రావడం గత సీజన్స్‏లోనూ జరిగింది. ఇక ప్రస్తుత 5వ సీజన్‏లో యాంకర్ రవి ఎలిమినేట్ అవుతాడని ఎవరు ఊహించలేదు. రవి ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులతోపాటు.. ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. టాప్ 3లో ఉంటాడనుకున్న రవి.. ఆకస్మాత్తుగా ఇంటి నుంచి రావడంతో అందరూ షాకయ్యారు. రవి ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ అతని అభిమానులు బిగ్ బాస్ గేట్స్ ముందు రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత రవి.. తొలిసారి తన ఇన్‏స్టా లైవ్‏లోకి వచ్చాడు. ఇందులో బిగ్ బాస్ షో గురించి… మీమ్స్ రాయుళ్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ ఇంట్లో జరిగేది ఒకటైతే.. బయటకు మరొకటి చూపిస్తున్నారని రవి అన్నాడు. తాను చేసింది ఒకటి.. బయటకు వేరేలా ప్రొజెక్ట్ చేశారంటూ రవి తెలిపాడు. అంతేకాకుండా.. బిగ్ బాస్ ఇంట్లో కాకుండా.. బయట కూడా మరోలా ఉంటుందని.. వాళ్లు చూపించేదాన్ని బట్టి మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారని.. కంటెస్టెంట్స్ ను ప్రమోట్ చేసేందుకు డబ్బులు తీసుకుంటారు. అది తప్పు అని నేను అనను.. కానీ నేను బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ముందు కూడా చెప్పాను.

ట్రోల్స్, మీమ్స్ ఏవైనా ఉంటే నన్ను ఇష్టమొచ్చినట్లు వాడుకోండని చెప్పాను. కానీ.. అలా కాకుండా నా ఫ్యామిలీ జోలికి వచ్చారు. నా భార్య మీద.. నా కూతురి మీద కూడా ట్రోల్స్ చేశారు. ఓ బ్యాచ్ ఉంది. వారిని ఏం అనాలో కూడా తెలియడం లేదు. వాళ్లకు ఓ రెండు వేల రూపాయలు ఇస్తే వాళ్లింట్లో వాళ్లను కూడా ట్రోల్స్ చేస్తారు అంటూ రవి ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: Actor Arjun: లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరోకు క్లీన్ చిట్.. మూడేళ్ల తర్వాత అర్జున్‏కు ఊరట..

Megastar Chiranjeevi : వరద బాధితుల కోసం భారీగా విరాళాలు ప్రకటించిన చిరంజీవి.. మహేష్ బాబు..