Megastar Chiranjeevi : వరద బాధితుల కోసం భారీగా విరాళాలు ప్రకటించిన చిరంజీవి.. మహేష్ బాబు..
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలతో రాయలసీమలోని జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అక్కడి స్థానిక ప్రజలు భారీ
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలతో రాయలసీమలోని జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అక్కడి స్థానిక ప్రజలు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విస్తారంగా కురిసిన వర్షాలకు చెట్లు, ఇళ్లు నెలమట్టం కాగా.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మరోవైపు చిత్తూరు, కడప జిల్లాలు భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయాయి. వందల ఎకరాలు పంటనష్టం.. ఆస్తినష్టం వాటిల్లింది. వరదల దాటికి పూర్తిగా నష్టపోయిన వారికి ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్.. వరద బాధితుల కోసం రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం వరద బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ లో వరదల విపత్తు బాధిత కుటుంబాలకు తన వంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ విషయాన్ని మెగాస్టార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
ట్వీట్..
Pained by the wide spread devastation & havoc caused by floods & torrential Rains in Andhra Pradesh. Making a humble contribution of Rs.25 lacs towards Chief Minister Relief Fund to help aid relief works. @ysjagan @AndhraPradeshCM pic.twitter.com/cn0VImFYGJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 1, 2021
ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి బాటలోనే ఆయన తనయుడు రామ్ చరణ్ సైతం కదిలాడు. వరధ బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా రూ. 25 లక్షలు ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. దీంతో చిరంజీవి, రామ్ చరణ్ ల నుంచి ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి రూ. 50 లక్షలు విరాళం అందింది. ఇక మరోవైపు.. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వరద బాధితుల కోసం ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి తనవంతు సాయంగా.. రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని మహేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
In light of the devastating floods in Andhra Pradesh, I would like to contribute 25 lakhs towards the CMRF. Request everyone to come forward and help AP during this hour of crisis. ?@ysjagan @AndhraPradeshCM
— Mahesh Babu (@urstrulyMahesh) December 1, 2021
Also Read: Pushpaka Vimanam: ఓటీటీలో ఆనంద్ దేవరకొండ సినిమా.. ఆహాలో పుష్పక విమానం స్ట్రీమింగ్ ఎప్పుడంటే..