Comedian Raghu: సినిమా టు లిక్కర్ బిజినెస్.. మద్యం షాపులను దక్కించుకున్న కమెడియన్ రఘు..
Raghu Karumanchi: టాలీవుడ్ కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న "రఘు" తాజాగా లిక్కర్ వైన్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో
Raghu Karumanchi: టాలీవుడ్ కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న “రఘు” తాజాగా లిక్కర్ వైన్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో పాల్గొన్న రఘు.. నల్లగొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్ పక్కనున్న అభినవ్ 1 & 2 దుకాణాలను చేజిక్కించుకున్నట్లు తెలిసింది. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల మద్యం దుకాణాలు దక్కించుకున్న నిర్వాహకులు.. అమ్మకాలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే కమెడియన్ రఘు తనకు వచ్చిన మద్యం దుకాణాల ముందు పూజలు నిర్వహించి.. కాసేపు కౌంటర్లు నిలబడి మద్యం అమ్మాడు. తన మిత్రులతో కలిసి వేసిన మద్యం సిండికేట్ లో రెండు వైన్స్ షాపులను సొంతం చేసుకున్నాడు. కాగా.. మద్యం దుకాణాల టెండర్లలో ఈసారి చాలామంది కొత్త వాళ్లకు షాపులు దక్కాయి.
కాగా.. తెలంగాణ ప్రభుత్వం ఈసారి మద్యం దుకాణాల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తూ వేలాన్ని నిర్వహించింది. గౌడ్ సామాజికవర్గానికి పదిహేను శాతం, పది శాతం ఎస్సీలకు.. మరో ఐదు శాతం ఎస్టీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికనుగుణంగా షాపులను సైతం పెంచారు. దీంతో రాష్ట్రంలో షాపుల సంఖ్య మరింత పెరిగింది. రిజర్వేషన్లు పెట్టడంతో.. సామాన్యులు సైతం టెండర్లల్లో పాల్గొన్నారు.
కాగా.. బుధవారం నుంచి తెలంగాణలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెండు సంవత్సరాల పాటు ఈ పాలసీ అమలులో ఉండనుంది. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గాను 48 మినహా మిగతా దుకాణాలకు లైసెన్స్ లు మంజూరు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
Also Read: