Vallabhaneni Vamsi: చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి క్షమాపణలు చెప్పిన వల్లభనేని వంశీ
Vallabhaneni Vamsi: ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక అంశంపై రాష్ట్రంలో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..
Vallabhaneni Vamsi: ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక అంశంపై రాష్ట్రంలో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారే రేగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు సతీమణికి క్షమాపణలు చెప్పారు. నేను భువనేశ్వరిపై పొరపాటున వ్యాఖ్యలు చేశానని, ఎమోషన్‌లో ఒక పదం తప్పుగా దొర్లిన మాట వాస్తవమని అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పారు. నా వ్యాఖ్యలకు నేను బాధపడుతున్నా.. టీడీపీలో నాకు అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరి. భువనేశ్వరిని నేను అక్కా అని పిలుస్తా.. అని అన్నారు. కులం నుంచి వెలివేస్తారనే భయంతో క్షమాపణ చెప్పలేదు.. నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నా. చంద్రబాబు నాయుడును కూడా క్షమపణ కోరుతున్నా.. తప్పు జరిగినందుకు పశ్చాత్తాప పడుతున్నానని అన్నారు. ఈ వివాదంలో అందరూ సంయమనం పాటించాలని అన్నారు. నా నుంచి ఇంకోసారి ఇలాంటి తప్పు దొర్లదు. నా ఆత్మ సాక్షిగా క్షమాపణ చెబుతున్నానని వంశీ అన్నారు.
ఇవి కూడా చదవండి: