AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie Ticket Price: సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతి.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం..

Telangana High Court: తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ల ధరల పెంచేందుకు థియేటర్లకు ధర్మాసనం అనుమతిచ్చింది. థియేటర్ల యాజమాన్యాలు ఇటీవల టికెట్ల ధరల పెంపునకు

Movie Ticket Price: సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతి.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం..
Movie Ticket Price
Shaik Madar Saheb
|

Updated on: Dec 01, 2021 | 8:00 PM

Share

Telangana High Court: తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ల ధరల పెంచేందుకు థియేటర్లకు ధర్మాసనం అనుమతిచ్చింది. థియేటర్ల యాజమాన్యాలు ఇటీవల టికెట్ల ధరల పెంపునకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. అఖండ, ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప తదితర బడ్జెట్‌ సినిమాలకు ధరలు పెంచుతామని థియేటర్ల యాజమన్యాలు తెలిపాయి. ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచేందుకు అనుమతివ్వాలంటూ విజ్ఞప్తి చేశాయి. అయితే.. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో థియేటర్ల యాజమాన్యాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే.. థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలను వెలువరించింది. ఒక్కో టికెట్‌పై రూ.50 మేర పెంచేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే.. విచారణ సందర్భంగా థియేటర్ల తరపున న్యాయవాది.. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ పేర్కొన్నారు. కాగా.. హైకోర్టు ఉత్తర్వులతో భారీ సినిమాల టికెట్ల రేట్లు పెరగనున్నాయి. అయితే.. ఇప్పటికే ఉన్న ధరలకు అదనంగా మరో రూ.50 వరకు ధరలు పెరగనున్నాయి.

Also Read:

Anchor Ravi: నా ఫ్యామిలీ జోలికి వచ్చారు.. డబ్బులిస్తే వాళ్లింట్లో వాళ్లను కూడా ట్రోల్ చేస్తారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్..

Actor Arjun: లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరోకు క్లీన్ చిట్.. మూడేళ్ల తర్వాత అర్జున్‏కు ఊరట..

Follow Us
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్