Akhanda Movie Release Live: మొదలైన అఖండ సందడి.. థియేటర్స్ ముందు అభిమానుల హంగామా..
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న అఖండ కోసం అభిమానులు
![Akhanda Movie Release Live: మొదలైన అఖండ సందడి.. థియేటర్స్ ముందు అభిమానుల హంగామా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/11/balakrishna-1-1.jpg?w=1280)
Akhanda Movie release live updates : నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న అఖండ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యను మరింత పవర్ ఫుల్ గా చూపించనున్నాడు బోయపాటి. రిలీజ్ కు ముందు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచాయి. ఇక ఈ సినిమా పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ ముందు అభిమానుల కోలాహలం మొదలైంది. తెల్లవారు జామునుంచే అభిమానుల హంగామా మొదలైంది.
మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. కానీ ఈ సారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారు. సెకండాఫ్‌లో బాలకృష్ణను అఘోరగా ఇంటెన్స్, యాక్షన్ అవతారంలో చూపించారు దర్శకుడు బోయపాటి శ్రీను. ద్వితీయార్థంలో బాలయ్య ఉగ్రరూపం కనిపిస్తుందట. మరోవైపు శ్రీకాంత్ విలనిజం కూడా హైలెట్ అవనుంది. జగపతి బాబు పాత్ర కూడా ప్రేక్షకులని మెప్పించనుంది. తమన్ మ్యూజిక్, ద్వారక క్రియేషన్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ సినిమాకు మేజర్ అసెట్స్. అంతే కాదు అఘోరాలు ఎందుకు అలా మారుతారు అనేది ఈ సినిమాలో చూపించనున్నారట. అలాగే దేవుడిని ఎందుకు నమ్మాలి అనే అంశాలను చూపించారట.
LIVE NEWS & UPDATES
-
యానాంకు తరలి వెళ్లిన బాలయ్య అభిమానులు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం బెనిఫిట్ షో లను నిషేధించడంతో అఖండ సినిమా కోసం యానాంకు తరలి వెళ్లిన బాలయ్య అభిమానులు…
-
యానాంలో బాలయ్య బాబు అఖండ బెనిఫిట్ షో
పుద్దిచేరి యానాం అధికారుల అనుమతులతో అఖండ బెనిఫిట్ షోలు నిర్వహిస్తున్న యానాం థియేటర్బ్ యాజమాన్యం.
-
-
అఖండ భారీ విజయం సాధించాలి : గోపీచంద్ మలినేని
బాలకృష్ణ అఖండ సినిమా ఘనవిజయం సాధించాలని అన్నారు గోపీచంద్ మలినేని. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
Wishing #NandamuriBalakrishna Gaaru, #BoyapatiSreenu Gaaru, @MusicThaman Bawa & Team #AKHANDA ..
A MASSIVELY ROARING BLOCKBUSTER! ??#JaiBalayya ?? pic.twitter.com/nrNxJeDJmQ
— Gopichandh Malineni (@megopichand) December 1, 2021
-
అఖండ చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా : మంచు విష్ణు
అఖండ సినిమా పెద్ద స్క్రీన్ పై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అన్నారు మంచు విష్ణు.. బాలయ్య మరోసారి యాక్షన్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Wishing the best for #Akhanda Can’t wait to watch it on the big screen. Bala anna in his best element!
— Vishnu Manchu (@iVishnuManchu) December 2, 2021
-
బాలయ్య బాబులో పరమశివుడిని చూసినట్టుంది..
బాలకృష్ణలో పరమ శివుడిని చూసినట్టు ఉంది అని అంటున్న అభిమానులు, అఖండ సినిమా పంచభక్షపరవనంలా ఉంది అంటున్నారు ఫాన్స్..
-
-
ఏడున్నర ఏళ్ల తరువాత బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన సినిమా
ఏడున్నర ఏళ్ల తరువాత బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన సినిమా.. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన అఖండ.
-
బాలయ్య నట విశ్వరూపం చూపించారు: అభిమానులు
సినిమా సంచలన విజయం సాధించింది అంటున్నారు అభిమానులు.. బాలయ్య నట విశ్వరూపం చూపించారంటున్నారు ఫాన్స్.. బెనిఫిట్ షో చుసిన అభిమానులు జై బాలయ్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు..
-
ప్రేక్షకుల మధ్య అఖండ చూడటం అదృష్టం : నిర్మాత రవీంద్ర
సినిమా జాతర ఇప్పుడే మొదలైంది అన్నారు మిరియాల రవీంద్ర.. సినిమా విజయం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు. ప్రేక్షకుల మధ్య అఖండ చూడటం అదృష్టం అన్నారు రవీంద్ర
-
జాతర ఇప్పుడే మొదలైంది : నిర్మాత రవీంద్ర
ప్రేక్షకుల ఆనందంకోసమే అఖండ తీశామన్నారు నిర్మాత మిరియాల రవీంద్ర.. రాబోయే సినిమాలకు అఖండ బాట వేసిందన్నారు రవీంద్ర
-
పూర్తయిన బెనిఫిట్ షో..
బెనిఫిట్ షో పూర్తయ్యింది. బ్లాక్ బస్టర్ హిట్ అంటున్న అభిమానులు, అఘోరాగా బాలయ్య ఇరగదీశారంటున్న అభిమానులు..
-
సీఎం బాలయ్య అంటూ అభిమానుల హంగామా..
అఖండ సినిమా బెనిఫిట్ షో కూకట్ పల్లి భ్రమరాంభ థియేటర్ లో ప్రదర్శించారు. అర్ధరాత్రి నుంచే అభిమానులు హంగామా చేస్తున్నారు. జై బాలయ్య , సీఎం బాలయ్య అంటూ భారీగా నినాదాలు చేస్తున్నారు.
-
మరికాసేపట్లో భ్రమరాంభ థియేటర్‌కు బాలయ్య
మరికాసేపట్లో భ్రమరాంభ థియేటర్‌కు రానున్న నందమూరి బాలకృష్ణ
-
అఖండ విజయం సాధించేసింది.. : సమీర్
మరో బ్లాక్ బస్టర్ పడింది.. బాలయ్య బోయపాటి కాంబో అదిరిపోయిందన్న అన్న నటుడు సమీర్. అఖండ సినిమా అఖండ విజయం సాధించింది అన్న సమీర్
-
థియేటర్‌కు చేరుకున్న నిర్మాత మిర్యాల రవీంద్ర
భ్రమరాంబ థియేటర్ కు చేరుకున్న నిర్మాత మిర్యాల రవీంద్ర.. సినిమా సూపర్ హిట్ అంటూ నినాదాలు చేసిన అభిమానులు
-
జై బాలయ్య నినాదాలతో హోరెత్తిస్తున్న అభిమానులు..
బాణాసంచా కలుస్తూ.. జై బాలయ్య అంటూ భారీఎత్తున నినాదాలతో హోరెత్తిస్తున్న అభిమానులు..
-
అర్ధరాత్రి నుంచే అభిమానుల సందడి..
అర్ధరాత్రి నుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్ద సందడి చేశారు.. నందమూరి అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు.
-
తెల్లవారుజామున 4 గంటలకు మొదలైన షో
తెల్లవారుజామున 4 గంటలకు కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్‌లో అఖండ బెనిఫిట్ షో మొదలైంది
-
థియేటర్ కి వచ్చిన హీరో తారకరత్న, నిర్మాత దిల్ రాజు
అఖండ సినిమా చూడడానికి భ్రమరాంబ థియేటర్ కి వచ్చిన హీరో తారకరత్న, నిర్మాత దిల్ రాజు.
Published On - Dec 02,2021 7:01 AM