AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikita Dutta: తలపై కొట్టి ఫోన్‌ లాక్కెళ్లారు.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్న బాలీవుడ్‌ నటి..

'లస్ట్ స్టోరీస్', 'కబీర్ సింగ్','మస్కా', 'ది బిగ్‌బుల్‌' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నికితా దత్తా. కాగా ఇటీవలే ఈ నటికి చేదు అనుభవం ఎదురైంది

Nikita Dutta: తలపై కొట్టి ఫోన్‌ లాక్కెళ్లారు.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని  పంచుకున్న బాలీవుడ్‌ నటి..
Basha Shek
|

Updated on: Dec 02, 2021 | 10:35 AM

Share

‘లస్ట్ స్టోరీస్’, ‘కబీర్ సింగ్’,’మస్కా’, ‘ది బిగ్‌బుల్‌’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నికితా దత్తా. కాగా ఇటీవలే ఈ నటికి చేదు అనుభవం ఎదురైంది. కొందరు అగంతకులు ఆమెపై దాడి చేసి సెల్‌ఫోన్‌ను లాక్కెళ్లారు. ఈ క్రమంలో మరెవరూ ఇలాంటి దోపిడీల బారిన పడకుండా ఉండేందుకు, ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే తలంపుతో తనకు జరిగిన షాకింగ్‌ అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంది నిఖిత. ‘ నవంబర్‌ 29న నాకు షాకింగ్‌ అనుభవం ఎదురైంది. నేను తీవ్ర భయాందోళనకు గురయ్యాను. ఆ ఘటన నుంచి తేరుకోవడానికి 24 గంటలకు పైగా సమయం పట్టింది. బాంద్రాలోని 14వ నంబర్‌ రోడ్డుపై రాత్రి 7.45 గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి నా తలపై గట్టిగా కొట్టారు. ఏమైందోనని తెలుసుకునేలోపే చేతిలో ఉన్న నా ఫోన్‌ను లాక్కెళ్లారు. దీంతో నేను కొన్ని సెకన్ల పాటు షాక్‌కు గురయ్యాను. నేను తేరుకునేలోపే ఆ అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు.’

‘ ఆ సమయంలో వాకింగ్ చేస్తున్నవారు నాకు ఎంతగానో సాయపడ్డారు. ఒక వ్యక్తి బైక్‌పై వారిని పట్టుకోవడానికి కూడా ప్రయత్నించాడు. కానీ వారు అప్పటికే చాలా దూరం వెళ్లిపోయారు. ఆ క్షణంలో నా కళ్ల నుంచి కన్నీళ్లు ఆగలేదు . అనంతరం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పి కేసు పెట్టాను. ప్రజలకు అవగాహన కలిగించడానికి నేను సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెడుతున్నాను. నాలా మరొకరికి ఈ విధంగా జరగకూడదని కోరుకుంటున్నాను. మనం కష్టపడి సంపాదించిన సొమ్ము మన ప్రమేయం లేకుండా ఎవరూ కోల్పోవద్దన్నదే నా ఉద్దేశం’ అని రాసుకొచ్చిందీ బాలీవుడ్‌ తార. కాగా నికిత పెట్టిన పోస్టుకు పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు స్పందించారు. అభిషేక్ బచ్చన్ ‘ టేక్ కేర్’ అని జాగ్రత్త చెప్పగా మరికొందరు ‘స్టే స్ట్రాంగ్‌’ అంటూ ధైర్యం చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by Nikita Dutta ? (@nikifying)

Also Read:

Naga Shaurya: ఆమెను చూస్తే ఎవ్వరికైనా రొమాన్స్ చేయాలనిపిస్తుంది.. నాగ శౌర్య ఆసక్తికర కామెంట్స్

Ramcharan: ఆచార్యలో చరణ్‌ పాత్రపై క్లారిటీ!.. సినిమాలో ఎంతసేపు కనిపించనున్నాడంటే..

Shilpa Chowdary: ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కిలాడి లేడి శిల్పా చౌదరి లీలలు.. తాజా లిస్టులో ప్రముఖ సినీ ఫ్యామిలీ!