AHA OTT: ఆహా కోసం బరిలోకి దిగనున్న సుకుమార్‌.? భారీ స్కెచ్‌ వేస్తోన్న తొలి తెలుగు ఓటీటీ..

AHA OTT: తొలి తెలుగు ఓటీటీగా రంగంలోకి దిగిన ఆహా తన స్ట్రాటజీని మార్చుకుంటూనే ఉంది. ఓటీటీ వేదికలో తొలిసారి టాక్‌షోలను పరిచయం చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆహా..

AHA OTT: ఆహా కోసం బరిలోకి దిగనున్న సుకుమార్‌.? భారీ స్కెచ్‌ వేస్తోన్న తొలి తెలుగు ఓటీటీ..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 23, 2021 | 5:30 PM

AHA OTT: తొలి తెలుగు ఓటీటీగా రంగంలోకి దిగిన ఆహా తన స్ట్రాటజీని మార్చుకుంటూనే ఉంది. ఓటీటీ వేదికలో తొలిసారి టాక్‌షోలను పరిచయం చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆహా.. ఒరిజినల్స్‌ పేరుతో వెబ్‌ సిరీస్‌లను సైతం తెరకెక్కిస్తోంది. అయితే ఇప్పుడా వెబ్‌ సిరీస్‌లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే అగ్ర దర్శకుడు సుకుమార్‌ను రంగంలోకి దింపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆహా వేదికగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న వెబ్‌ సిరీస్‌కు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌కు ఇప్పటి వరకు లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్‌ను కేటాయించేందుకు ఆహా సంసిద్ధత తెలపడంతో త్వరలోనే వెబ్‌ సిరీస్‌ పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

అయితే సుకుమార్‌ కథ, మాటలు అందించనున్న ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం ఎవరు వహిస్తారన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక దీనిని సుకుమార్‌ రైటింగ్స్‌, ఆహా సంయుక్తంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌ కథకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు హల్చల్‌ చేస్తోంది. ఓ సామాన్య వ్యక్తి, వ్యవస్థను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడన్న కథాంశంతో ఈ వెబ్‌ సిరీస్‌ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో సుకుమార్‌ దర్శకత్వం వహించిన జగడం, తాజాగా వచ్చిన పుష్ప కూడా ఇలాంటి కథాంశంతో వచ్చిన విషయం తెలిసిందే. మరి ఆహా ఓటీటీలో సుకుమార్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేయానున్నాడో తెలియాలంటే పూర్తి వివరాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Radhe Shyam Pre Release Event Live: ఘనంగా రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

Pushpa: బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోన్న పుష్ప వసూళ్ల వర్షం.. హిందీలో కూడా తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్‌..

TS Inter: తెలంగాణ ఇంటర్‌ రివాల్యుయేషన్‌కు రికార్డు దరఖాస్తులు.. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో తెలుసా.?