Pushpa: బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోన్న పుష్ప వసూళ్ల వర్షం.. హిందీలో కూడా తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్‌..

Pushpa: అల్లు అర్జున్‌, సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. పాన్‌ ఇండియా సినిమా విడుదలైన పుష్ప వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. డిసెంబర్‌ 17న విడుదలైన ఈ సినిమా..

Pushpa: బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోన్న పుష్ప వసూళ్ల వర్షం.. హిందీలో కూడా తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 23, 2021 | 3:54 PM

Pushpa: అల్లు అర్జున్‌, సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. పాన్‌ ఇండియా సినిమా విడుదలైన పుష్ప వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. డిసెంబర్‌ 17న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. తొలిరోజే రూ. 71 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రోజురోజుకీ వసూళ్లను పెంచుకుంటూ పోతోంది. విడుదలైన అన్ని భాషల్లో పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకొని రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది.

ఇప్పటి వరకు అన్ని వెర్షన్లలో కలుపుకొని రూ. 145.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందీ సినిమా. సంక్రాంతికి విడుదల కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ తప్ప మరో బడా చిత్రం లేకపోవడంతో పుష్ప వసూళ్లు మరింత పెరిగే అవకాశాలున్నాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాగే కొనసాగితే పుష్ప రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరడం పెద్ద కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక బాలీవుడ్‌లోనూ పుష్ప సంచలనం దిశగా దూసుకుపోతోంది. హిందీలో కేవలం ఐదు రోజుల్లోనే పుష్ప ఏకంగా రూ. 20.14 కోట్ల వసూళ్లను సాధించింది. పుష్ప ఇప్పటి వరకు ముంబయిలో రూ. 8.83 కోట్లు, ఢిల్లీలో రూ. 3.37 కోట్లు, బిహార్‌లో రూ. 1.31 కోట్లు, వెస్ట్‌ బెంగాల్‌లో రూ. 1.18 కోట్లు, రాజస్థాన్‌లో రూ. 1.06 కోట్లు వసూళ్లతో కొనసాగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ యాక్టింగ్‌కు బీటౌన్‌ ఫ్యాన్స్‌ సైతం ఫిదా అవుతున్నారు. ఇక తమిళం, కన్నడంలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ బన్నీకి ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. దీంతో ఈ రాష్ట్రాల్లో పుష్ప కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప రెండో పార్ట్‌ అయిన ‘ది రూల్‌’ చిత్రీకరణ ఫిబ్రవరిలో మొదలు కానున్న విషయం తెలిసిందే.

Also Read: ఒలంపిక్స్‌లో పతకమే లక్ష్యంగా దుబాయ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న హీరో కొడుకు

Visakhapatnam: విశాఖ మత్స్యకారులకు చిక్కిన అనుకోని అతిథి.. తంతిడి తీరంలో వేల్‌ షార్క్‌..

Pushpa Movie: తనకు ఇద్దరూ కూతుర్లే.. ఇప్పుడు పుష్పరాజ్ వంటి కొడుకు కావాలంటున్న కల్పలత..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ