Visakhapatnam: విశాఖ మత్స్యకారులకు చిక్కిన అనుకోని అతిథి.. తంతిడి తీరంలో వేల్‌ షార్క్‌..

విశాఖ తంతిడి తీరానికి అనుకొని అతిథి వచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా గుర్తించబడిన వేల్‌ షార్క్‌ విశాఖ తీరంలో కనిపించడంతో నగరవాసులు తన్మయం చెందారు.

Visakhapatnam: విశాఖ మత్స్యకారులకు చిక్కిన అనుకోని అతిథి.. తంతిడి తీరంలో వేల్‌ షార్క్‌..
World Largest Fish Whale Sh
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 23, 2021 | 1:29 PM

World Largest Fish whale shark: విశాఖ తంతిడి తీరానికి అనుకొని అతిథి వచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా గుర్తించబడిన వేల్‌ షార్క్‌ విశాఖ తీరంలో కనిపించడంతో నగరవాసులు తన్మయం చెందారు. అందుకు సంబంధించన వీడియో ఒకటి ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. విశాఖ తంతడి బీచ్‌లో స్థానిక మత్స్యకారులను అనుకోని అతిథి పలకరించి. 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉండే ప్రపంచంలోనే అతి పెద్ద చేప వేల్ షార్క్ మత్స్యకారుల వలలో పడింది. మత్స్యకారులు యథావిథిగా చేపల కోసం వేసిన వలలో వేల్ షార్క్ చిక్కింది. వలను చాలా బరువుగా అనిపించడంతో.. మత్స్యకారులు అందరూ కలిసి పైకి లాగారు. అంతే దాన్ని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

ప్రపంచంలోనే అతిపెద్ద చేప ఒడ్డుకు రావడాన్ని గమనించి.. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని తెలియజేశారు వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకాంత్‌ మన్నెపూరి. దీంతో విశాఖ డీఎఫ్‌వో అనంత్‌ శంకర్‌ ఆదేశాల మేరకు సిబ్బంది వెంటనే తంతడి బీచ్‌కు చేరుకొని ఆ చేప ప్రపంచంలోనే అతిపెద్దైన వేల్‌షార్క్‌గా నిర్ధారించారు. అంతరించిపోతున్న షార్క్‌ల జాతిలో ఇదొకటిగా గుర్తించారు అధికారులు.

డీఎఫ్ వో ఆదేశాల మేరకు షార్క్‌ను సురక్షితంగా సముద్రంలోకి పంపించే ఏర్పాట్లు చేశారు. వెంటనే షార్క్‌కు ఫిల్టర్‌ ఫీడింగ్‌ ఇచ్చారు అటవీ శాఖ సిబ్బంది, మత్స్యకారులు, వన్యప్రాణుల సంరక్షకులు. అనంతరం షార్క్‌ను సురక్షితంగా సముద్రంలోకి పంపించారు. 2-టన్నుల చేప సజీవంగా సముద్రంలోకి తిరిగి వెళ్లింది. తమ ప్రయత్నాలు విజయవంతం అయ్యాయని సముద్రపు లోతుల్లోకి వెళ్లి.. స్వేచ్ఛగా ఈదుతోందని తెలిపారు అధికారులు.

ఈశ్వర్, టీవీ9, రిపోర్టర్

ఇవి కూడా చదవండి: Pralay Missile: చైనా గుండెల్లో వణుకుపుట్టిస్తున్న ప్రళయ్‌.. భారత క్షిపణి పరీక్ష విజయవంతం..

Viral Video: గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయాడు.. 30 అడుగుల ఎత్తులో వేలాడాడు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..