AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Theaters: ఏపీలో పలు థియేటర్స్ క్లోజ్.. స్వచ్ఛందంగా కొన్ని.. సీజ్ చేయడంతో కొన్ని..

AP Movie Theaters: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్స్ ధరపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే థియేటర్స్‌లో టికెట్స్‌ను..

AP Theaters: ఏపీలో పలు థియేటర్స్ క్లోజ్.. స్వచ్ఛందంగా కొన్ని.. సీజ్ చేయడంతో కొన్ని..
Ap Movie Theaters
Surya Kala
|

Updated on: Dec 24, 2021 | 11:04 AM

Share

AP Movie Theaters: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్స్ ధరపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే థియేటర్స్‌లో టికెట్స్‌ను అమ్మాలని థియేటర్స్ యజమానులకు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్లపై అధికారులు దాడులు చేస్తున్నారు. పలు జిల్లాల్లో సినిమా హాళ్ళలో తనిఖీలు నిర్వహిస్తూ.. అనేక థియేటర్స్ ను మూసివేశారు. మరికొన్ని జిల్లాల్లో తాము థియేటర్స్ ను నడపలేమంటూ స్వచ్ఛందంగా మూసివేశారు. జిల్లాల వారీగా క్లోజ్ అయిన థియేటర్స్ వివరాల్లోకి వెళ్తే..

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 127 సినిమా థియేటర్స్ ఉన్నాయి. ఈ మూవీ థియేటర్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. దీంతో 14 థియేటర్లు మూతపడ్డాయి. ఒక థియేటర్ కు 20 వేల జరిమానా విధించారు.  మరోవైపు కృష్ణా జిల్లా లో రెండు థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు.

అయితే ఏపీలో థియేటర్లు సీజ్ చేయడాన్ని విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తున్నారు.  జేసీ కి తప్ప ఇతర అధికారులకు సీజ్ చేసే అధికారం లేదని చెబుతున్నారు. అంతేకాదు అసలు థియేటర్స్ ను మూసివేయాలంటే అధికారులు 15 రోజుల ముందు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ చెప్పారు. తమనుంచి అధికారులు వివరణ తీసుకున్న తర్వాత మాత్రమే ఏదొక నిర్ణయం తీసుకోవాలని  ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. అసలు హై కోర్టు లో కేసు ఉండగా అధికారులకు తమ థియేటర్స్ లో ఎలాంటి తనిఖీలు చేయడం కరెక్ట్ కాదని అధికారుల తీరుని తప్పుబడుతుంది ఎగ్జిబిటర్స్ అసోసియేషన్.

ఇక చిత్తూరు జిల్లాలోని మదనపల్లి డివిజన్ లో 37 సినిమా థియేటర్స్ లో సబ్ కలెక్టర్ జాహ్నవి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 18 థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. తాత్కాలికంగా మూసివేశారు.  మదనపల్లిలో 7, కుప్పంలో 4, పుంగనూరులో 3, వి కోట 2, తంబల్లపల్లి రొంపిచర్ల లో ఒక్కో ఒక్కో థియేటర్ మూసివేశారు. మరికొన్ని థియేటర్లపై తహసీల్దార్ల నుంచి వచ్చే నివేదికలు ఆధారంగా చర్యలు తీసుకోనున్నామని సబ్ కలెక్టర్ చెప్పారు. తిరుపతి లోనూ కొన్ని థియేటర్లలో తహశీల్ధార్ తనిఖీలు నిర్వహించి.. ఆర్డీఓ కు నివేదికనిచ్చారు.

విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఆరు థియేటర్స్ ను సీజ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో థియేటర్ కి రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు.

అనంతపురంజిల్లాలో హిందూపురంలో సినిమా థియేటర్లను రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. అధిక ధరలతో టికెట్ల అమ్మకం, రోజుకి ఎన్ని షో లు వేస్తున్నారనే విషయాలను అధికారులు పరిశీలించారు.  ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే థియేటర్లను సీజ్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ప్రకాశం జిల్లాలోని  అద్దంకి పట్టణంలో విఎన్ఎస్, మినీ విఎన్ఎస్ 2 సినిమా థియేటర్లు అనుమతులు లేకుండా ప్రదర్శనలు చేస్తున్నారని రెవెన్యూ అధికారులు గుర్తించారు. వెంటనే సినిమా ప్రదర్శనలను ఆపి వేయించారు. ఒంగోలులో గోపి కృష్ణ థియేటర్ అనుమతి లేని కారణంగా ప్రదర్శన నిలిపేసిన రెవెన్యూ అధికారులు.

కడప జిల్లాలో మొత్తం 57 ధియేటర్లున్నాయి. అయితే వీటిల్లో 5 ధియేటర్లకు నోటీసులు ఇచ్చారు. టికెట్ రేట్లు అధికంగా ఉన్నాయని కంప్లైంట్ వచ్చినందున 5 ధియేటర్లకు నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పారు.

Also Read:  ఈ రాశివారు ఏకకాలంలో అనేక పనులు చేస్తారు.. అందులో మీరున్నారా లేదో తెలుసుకోండి..(photo gallery)