Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie: తనకు ఇద్దరూ కూతుర్లే.. ఇప్పుడు పుష్పరాజ్ వంటి కొడుకు కావాలంటున్న కల్పలత..

Pushpa Movie: స్టైలిష్ స్టార్, టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. తాజాగా పుష్ప సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. పుష్ప రాజ్ గా ఊర మాస్ లుక్ లో తనదైన శైలిలో నటించి...

Pushpa Movie: తనకు ఇద్దరూ కూతుర్లే.. ఇప్పుడు పుష్పరాజ్ వంటి కొడుకు కావాలంటున్న కల్పలత..
Pushpa Kalpa Latha
Follow us
Surya Kala

|

Updated on: Dec 23, 2021 | 12:53 PM

Pushpa Movie: స్టైలిష్ స్టార్, టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. తాజాగా పుష్ప సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతంచేసుకున్నాడు. పుష్ప రాజ్ గా ఊర మాస్ లుక్ లో తనదైన శైలిలో నటించి.. బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాడు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ బన్నీ క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అన్ని రకాల పాత్రలతో నటిస్తూ.. అభిమానులను అలరిస్తున్నాడు. తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ హిట్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. అయితే తాజాగా పుష్పరాజ్ తల్లిగా నటించిన కల్పలత బన్నీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది

ఇటీవల కల్పలత ఓ ఇంటర్వ్యూలో పుష్ప మూవీ సమయంలో సెట్స్ మీద విషయాలతో పాటు అల్లు అర్జున్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. బన్నీ షూటింగ్ నిమిత్తం సెట్స్  మీద వస్తే.. ఇక వేరే విషయాలు పట్టవని.. తన పాత్ర విషయంపైనే పూర్తిగా దృష్టిగా పెడతాడని చెప్పారు. తన పాత్రలో లీనమై పోతాడని కల్పలత చెప్పింది.

అంతేకాదు తనకు ఇద్దరు ఆడపిల్లలు.. తన కూతుర్లు ఇద్దరూ అమెరికాలో ఉన్నారని అన్నారు కల్పలత. అయితే ఇప్పటి వరకూ తనకు మగపిల్లలు లేరని ఎప్పుడూ అనిపించలేదు.. బాధపడలేదు… అయితే బన్నీ ని చూసిన తర్వాత తనకు కూడా ఒక మగపిల్లాడు ఉంటె బాగుండును అనిపించిందని చెప్పారు. ముఖ్యంగా పుష్ప షూటింగ్ కంప్లీట్ అయినా తర్వాత తన సొంత కొడుక్కి దూరమైపోతున్న ఫీలింగ్ కలిగిందని పేర్కొన్నారు. తనకు షూటింగ్ సమయంలో బన్నీ ఉండేవాడని.. తన చేయి పట్టుకుని నేను ఉన్నామంటూ కళ్లతోనే   దైర్యం చెప్పేవారని కల్పలత వెల్లడించారు. పుష్పరాజ్ లాంటి కొడుకు ఉంటే బాగుండేదని తాను బన్నీతో చెప్పగా బన్నీ దగ్గరకు తీసుకుని ఓదార్చాడని కల్పలత అన్నారు. మొత్తానికి తనకు బన్నీ లాంటి కొడుకు కావాలనిపించిందని చెప్పారు. పుష్ప సినిమాలో బన్నీ తల్లిగా కల్పలతకు మంచి గుర్తింపుదక్కింది. పుష్ప పార్ట్2 లో కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

Also Read: ఇంట్లో ఉత్తరం వైపు ఈ వస్తువులు లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం (WEB STORY)