Natural star Nani: టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించారు.. నేచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు..

నేచురల్ స్టార్ నానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించిందన్నారు. గత కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన.

Natural star Nani: టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించారు.. నేచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు..
Nani
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 23, 2021 | 12:33 PM

నేచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించిందన్నారు. గత కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రచ్చ వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ సర్కార్ అన్నట్టుగా మారుతోంది. ఇప్పటికే పలుమార్లు టాలీవుడ్ పెద్దలు, కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35పై కొందరు హైకోర్టుకు వెళ్లగా అక్కడ కొంత ఊరట లభించింది. అయినా ప్రభుత్వం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో అప్పీల్ వెళ్లింది.

ఈ సినిమా టికెట్ల వివాదంపై ఇప్పటి వరకు టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది స్పందించారు. ఎవరికి వారు తమదైన తరహాలో రియాక్ట్ అయ్యారు. ఇదే అంశంపై నేచురల్ స్టార్ నాని కూడా స్పందించారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందంటూ నాని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటుందన్నారు నాని. టికెట్ ధరలు పెంచినా కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని.. ఏపీ ప్రభుత్వం కావాలని వారిని అవమానిస్తుందన్నారు నేచురల్ స్టార్ నాని.

ఇవి కూడా చదవండి: Pralay Missile: చైనా గుండెల్లో వణుకుపుట్టిస్తున్న ప్రళయ్‌.. భారత క్షిపణి పరీక్ష విజయవంతం..

Viral Video: గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయాడు.. 30 అడుగుల ఎత్తులో వేలాడాడు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..