Radhe Shyam Pre Release Highlights: గ్రాండ్‌గా రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఫంక్షన్.. ఫుల్‌గా ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్

Rajitha Chanti

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 23, 2021 | 10:30 PM

Radhe Shyam Movie Trailer Launch Live Updates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు గురువారం చాలా స్పెషల్ .

Radhe Shyam Pre Release Highlights: గ్రాండ్‌గా రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఫంక్షన్.. ఫుల్‌గా ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్
Radheshyam

Radhe Shyam Movie Trailer: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు గురువారం స్పెషల్ రోజు. ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రాధేశ్యామ్ సినిమా కోసం ఎన్నో అంచనాలతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ విడుదల కోసం పాన్ ఇండియా లెవల్లో డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అభిమానుల నిరీక్షణ ఫలితంగా జనవరి 14న రాధేశ్యామ్ విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‏లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని రీతిలో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపించింది రాధేశ్యాం టీమ్. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ వేడుకకు సుమారు 40 వేల మంది పైగా ఫ్యాన్స్ హాజరయ్యారు. ఇక ఈ వేడుకకు మరో స్పెషాలిటీ కూడా ఉంది.. రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‏కు జాతిరత్నం హీరో నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా వ్యవహరించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Dec 2021 10:19 PM (IST)

    ప్రభాస్ కామెంట్స్

    ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నా. పెద్దనాన్న గారు పోస్టర్ లో చిన్నపాటి దేవడిలా ఉన్నారు. సినిమాటోగ్రాఫర్ నన్ను బాగా చూపించారు. జస్టిన్ గారి మ్యూజిక్ బాగుంది.  గోపికృష్ణ మూవీస్ అంటే కాస్త బాధ్యత, భయం ఉంటాయి. ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు అందరకీ, టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో నుంచి మీడియా వారికి థ్యాంక్స్. ఈ ఈవెంట్ బాగా జరిగేందుకు సహకరించిన రాచకొండ పోలీసులకు స్పెషల్ థ్యాంక్స్.  పూజా హెగ్డే చాలా బాగా నటించింది. రాధాకృష్ణ కుమార్ 3 ఏళ్ల కష్టం ఇది. క్లైమాక్స్ ఫైట్ హైలెట్ అవుతుంది. ఎనీ వే… ఇంతగా నా ప్రేమ చూపిస్తున్నందుకు నా డార్లింగ్స్ అందరికీ లవ్ యూ.. లవ్ యూ.. లవ్ యూ.

  • 23 Dec 2021 09:46 PM (IST)

    డైరెక్టర్ నాగ్ అశ్విన్ కామెంట్స్..

    పూజా హెగ్డే, ప్రభాస్ కెమిస్ట్రీ అదిరిపోయిందన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. రాధేశ్యామ్ అనంతరం ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకునే తెలుగు.. ప్రభాస్ హిందీ రెండు కలిపి ప్రాజెక్ట్ కే అంటూ నవ్వులు పూయించారు డైరెక్టర్ నాగ్ అశ్వి్న్..

  • 23 Dec 2021 09:41 PM (IST)

    మిర్చి డైలాగ్ చెప్పిన ఆదిపురుష్ డైరెక్టర్..

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ మిర్చి మూవీలోని ప్రభాస్ డైలాగ్ తెలుగులో చెప్పి ఆకట్టుకున్నాడు. ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

  • 23 Dec 2021 09:24 PM (IST)

    ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా…ట్రైలర్ అదుర్స్..

    రాధేశ్యామ్ ట్రైలర్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశ నాయకులు కలవాలి అనుకునే పేరున్న హస్త సముద్రికుడు విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించబోతున్నారు. ప్రాణం పోసే ప్రేమ ప్రాణాలను తీయగలదా అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

  • 23 Dec 2021 09:09 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ వేదికపైక రెబల్ స్టార్ ఎంట్రీ..

    ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈరోజు ఘనంగా రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్‏కు రెబల్ స్టార్ కృష్ణం రాజు ఎంట్రీ ఇచ్చారు.

  • 23 Dec 2021 08:56 PM (IST)

    ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్..

    యంగ్ రెబల్ స్టార్ చేతుల మీదుగా రాధేశ్యామ్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు దిల్ రాజు అతిథిగా వచ్చారు.

  • 23 Dec 2021 08:33 PM (IST)

    భారీ బందోబస్తు ప్రభాస్ ఎంట్రీ..

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ వద్దకు ప్రభాస్ చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు.

  • 23 Dec 2021 08:31 PM (IST)

    పట్టు చీరలో మెరిసిన బుట్టబొమ్మ..

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ వద్దకు హీరోయిన్ పూజహెగ్డే చేరుకుంది. బ్లూకలర్ పట్టు చీరలో బుట్టబొమ్మ తళుక్కున మెరిసిపోయింది.

  • 23 Dec 2021 08:24 PM (IST)

    నవీన్ పొలిశెట్టి ఎంట్రీ అదుర్స్..

    రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏ వేదికపై ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నవీన్ పొలిశెట్టి. జాతిరత్నాలు పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేశాడు ఎంటర్‏టైనర్ నవీన్ పొలిశెట్టి.

  • 23 Dec 2021 08:16 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ వేడుకకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

  • 23 Dec 2021 08:13 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తోన్న రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో రాధేశ్యామ్ కోసం ఆస్ట్రేలియాలో స్పెషల్‌ షోలు వేయనున్నారు. అది కూడా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌పై. మెల్‌బోర్న్‌ నగరంలోని ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. 105*75 అడుగులున్న ఈ ఐమ్యాక్స్‌ థియేటర్‌ ఇది.

  • 23 Dec 2021 07:52 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    బాహుబలి సినిమా కోసం ప్రభాస్ ఎన్నో సినిమాలను వదులుకున్నారు.. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అంతా అభిమానుల కోసమే ప్రభాస్. ప్రభాస్ ఇండియన్ సినిమాకు రాజు అంటూ ప్రశంసలు కురిపించారు పాటల రచయిత కృష్ణకాంత్.

  • 23 Dec 2021 07:29 PM (IST)

    ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదుగా..

    దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ సినిమా రాబోతుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు జరుగుతున్న రాధేశ్యా్మ్ ప్రీరిలీజ్ ఈవెంట్‏కు దాదాపు 40 వేల మంది అభిమానులు హజరయ్యారు. దీంతో వెయ్యి మంది పోలీసు బందోబస్తు మధ్య ప్రీరిలీజ్ ఈవెంట్‏ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేస్తూ.. బారికేడ్లను.. కుర్లీలను పక్కన పడేస్తున్నారు.

  • 23 Dec 2021 07:26 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై మరోసారి విక్రమాధిత్య ఆకట్టుకున్నాడు. నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, నీ చావు నాకు తెలుసు కానీ నీకు చెప్పను, నాకు అన్నీ తెలుసు కానీ నీకు చెప్పను, చెప్పినా మీ ఆలోచనలకి అందదు అంటూ ప్రభాస్ ఇంట్రడ్యూసింగ్ వీడియోను మరోసారి ప్లే చేశారు మేకర్స్.

  • 23 Dec 2021 07:22 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    పాన్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు రష్మీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోంది. అన్ని భాషల నుంచి ప్రభాస్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో డార్లింగ్ అభిమానుల కోసం రష్మీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో మాట్లాడుతూ ఆకట్టుకుంటుంది.

  • 23 Dec 2021 07:08 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభమైంది.. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఎఫ్సీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు సోషల్ మీడియాలో రాధేశ్యామ్ మేనియా కొనసాగుతుంది.

  • 23 Dec 2021 07:01 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ వేడుకకు చేరుకున్న ప్రభాస్..

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ వద్దకు ప్రభాస్, పూజా హెగ్డే చేరుకున్నారు. ఈ వేడుకను కవర్ చేయడానికి నేషనల్ మీడియా సైతం ఈవెంట్‏లో భాగమయ్యారు.

  • 23 Dec 2021 06:59 PM (IST)

    వెయ్యి మంది పోలీసుల సమక్షంలో..

    రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ రాబోతుండడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జాయిట్‏గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈవెంట్‏కు చేరుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ రచ్చ చేస్తున్నారు. దాదాపు వెయ్యి మంది పోలీసుల సమక్షంలో ఘనంగా రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.

  • 23 Dec 2021 06:48 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి ఇది స్పెషల్‌ డే. బాహుబలి, సాహో తర్వాత…డార్లింగ్‌ అప్‌ కమింగ్‌ మూవీ రాధేశ్యామ్‌. ఫ్యాన్స్‌ ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు. న్యూ ఇయర్‌, సంక్రాంతి పండుగ ముందే వచ్చేసిందంటు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు అభిమానులు.

  • 23 Dec 2021 06:32 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    రామోజీ ఫిల్మ్ సిటీలో రాధేశ్యామ్ సందడి. గ్రాండ్‏గా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా తరలిరావడంతో రామోజీ ఫిల్మ్ సిటీలో రాధేశ్యామ్ జాతర కనిపిస్తోంది. ప్రభాస్, కృష్ణం రాజు పాత్రలకు సంబంధించిన భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు.

  • 23 Dec 2021 06:13 PM (IST)

    హోస్ట్‏గా యంగ్ హీరో..

    ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది పండుగ రోజు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్.. జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. కానీ దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు జరుగుతోంది. ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని రీతిలో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది రాధేశ్యాం టీమ్. ఈ వేడుకకు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హోస్ట్‏గా వ్యవహరించనున్నారు.

  • 23 Dec 2021 06:07 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన రాధేశ్యామ్ టీజర్‏కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అందులో విక్రమాదిత్యగా ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, నీ చావు నాకు తెలుసు కానీ నీకు చెప్పను, నాకు అన్నీ తెలుసు కానీ నీకు చెప్పను, చెప్పినా మీ ఆలోచనలకి అందదు అంటూ విక్రమాదిత్య చెప్పడం.. సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.

  • 23 Dec 2021 05:58 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్‏కు భారీగా ప్రభాస్ ఫ్యాన్స్ తరలివచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీ డార్లింగ్ అభిమానులతో కళకళలాడుతుంది. ఈ వేడుకకు దాదాపు 40 వేల మంది వరకు ఫ్యాన్స్ రావొచ్చని అంచనా వేస్తున్నారు.

  • 23 Dec 2021 05:46 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    ప్రభాస్.. పూజా హెగ్డే కాంబోలో రాబోతున్న పీరియాడిక్ వింటెజ్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట్లో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇక కాసేపట్లో ప్రారంభమయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు ప్రభాస్ ఫ్యాన్స్ తరలివస్తున్నారు.

  • 23 Dec 2021 05:43 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    లాంగ్ గ్యాప్ తరువాత రొమాంటిక్ రోల్‌లో కనిపించబోతున్నారు డార్లింగ్ ప్రభాస్‌. దాదాపు ఏడేళ్లుగా యాక్షన్ పాత్‌లో ఉన్న ప్రభాస్‌.. ఇప్పుడు కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాధేశ్యామ్‌గా తన ప్రేమకథను చూపిచేందుకు రెడీ అవుతున్నారు. దీంతో గతంలో డార్లింగ్ చేసిన రొమాంటిక్ మూవీస్‌ను రీకాల్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌.

  • 23 Dec 2021 05:36 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    ప్రభాస్‌ ప్రజెంట్ ఇండియన్‌ స్క్రీన్ మీద తిరుగులేని సూపర్‌ స్టార్‌. బాహుబలి ముందు జస్ట్ రీజినల్‌ హీరోగా మాత్రమే ఉన్న డార్లింగ్‌కు ఈ రేంజ్‌ క్రేజ్‌ రావటం వెనుక అసలు రీజన్సేంటి..? సౌత్‌ నటులను గుర్తించేందుకు కూడా ఇష్టపడని నార్త్ జనాలను డార్లింగ్ ఎలా మెప్పిస్తున్నారన్నది ఇంట్రస్టింగ్ పాయింట్.

  • 23 Dec 2021 05:32 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    రాధేశ్యామ్ సినిమాతో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు డార్లింగ్ ప్రభాస్‌. ఇన్నాళ్లు పాన్ ఇండియా సినిమా అంటే ఒకే కథ ఒకే కాన్సెప్ట్‌… జస్ట్ లాంగ్వేజ్‌ మాత్రమే మారుతూ వస్తుంది. కానీ రాధేశ్యామ్‌ తో ఈ రూల్‌ను బ్రేక్ చేస్తున్నారు. కథా కంటెంట్ మారకపోయినా… అవుట్‌పుట్‌లో మాత్రం చాలా వేరియేషన్‌ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్‌ దగ్గర నుంచి ఆ చేంజ్‌ చూపిస్తున్నారు మేకర్స్‌.

  • 23 Dec 2021 05:26 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    రాధేశ్యామ్… పీరియాడిక్‌ లవ్‌ స్టోరి, వింటేజ్‌ కార్లు, ఓల్డ్‌ బిల్డింగ్స్‌, మెస్మరైజ్‌ చేసే లోకేషన్స్‌… ఇలా తెర మీద కొత్త లోకాన్ని చూపిస్తున్నారు. అయితే వీటిలో చాలా వరకు ప్రజెంట్ జనరేషన్‌లో రియాలిటీలో లేవు. అందుకే అలాంటి అందమైన ప్రపంచాన్ని ఆడియన్స్‌కు చూపించేందుకు అధునాతన టెక్నాలజీని వాడుతోంది రాధేశ్యామ్ టీమ్‌.

  • 23 Dec 2021 05:23 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    ఇండియాలో మరే సినిమాకు లేని విధంగా.. ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేశాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పాటలు రూపొందించింది రాధే శ్యామ్ టీం.

  • 23 Dec 2021 05:20 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో సినిమా నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తూ.. ప్రభాస్ ఫ్యాన్స్‏ను ఖుషి చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఇదే ప్రీరిలీజ్ ఈవెంట్‏లో రాధేశ్యామ్ ట్రైలర్ సైతం విడుదల కానుంది.

  • 23 Dec 2021 05:17 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జిల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో.. భారీ అంచనాలే ఉన్నాయి. హాలీవుడ్‌ మూవీ గ్లాడియేటర్‌కు యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ పనిచేయడంతో రాధే శ్యామ్‌పై మరింత ఆసక్తి పెరిగింది.

  • 23 Dec 2021 05:16 PM (IST)

    రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

    లవ్ డ్రామాగా డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్.. సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ విక్రమాదిత్యగా ప్రత్యేకమైన క్యారెక్టరైజేష‌న్‏లో కనిపించబోతున్నారు. ప్రభాస్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజహెగ్డే నటించింది. రాధే శ్యామ్.. ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా.. కరోనా సహా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

Published On - Dec 23,2021 5:12 PM

Follow us
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్